- ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అక్కడ కొత్త కనెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది.. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత మీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఏదైనా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవాలి (ఇండేన్/హెచ్‌పీ గ్యాస్/భారత్ గ్యాస్).
- తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత కస్టమర్ పేరు, మొబైల్ నంబర్, ఇ- మెయిల్, క్యాప్చా కోడ్ సహా ఇతర వివరాలు నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది.
- దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీస్కొని వివరాలు నింపాలి.
- ఆ తర్వాత దానిని సదరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు అందించాల్సి ఉంటుంది.
- తర్వాత మీ వివరాలు ధ్రువీకరించి కనెక్షన్ ఇస్తారు.
- ఉజ్వల స్కీమ్ కింద మొదట స్టవ్, సిలిండర్ ఫ్రీగానే వస్తుంది.
- తర్వాతి నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ వస్తుంది.
- ఏటా 12 సిలిండర్లపై రాయితీ వర్తిస్తుంది.