Flipkart Big Billion Days 2024: కళ్ళు చెదిరే డిస్కౌంట్స్, ఆఫర్లు ఇస్తున్న ఫ్లిప్కార్ట్!

Flipkart Big Billion Days 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలని ప్రకటించింది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, అప్లియన్సెస్ ప్రోడక్ట్ లపై అదిరిపోయే డీల్స్ ని అందిస్తుంది.

Flipkart Big Billion Days 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలని ప్రకటించింది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, అప్లియన్సెస్ ప్రోడక్ట్ లపై అదిరిపోయే డీల్స్ ని అందిస్తుంది.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలని ప్రకటించింది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, అప్లియన్సెస్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ లపై అదిరిపోయే డీల్స్ ని అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 27న స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు ఒక రోజు ముందుగానే ఆఫర్లు పొందవచ్చు. వారికి సెప్టెంబర్ 26న ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ స్టార్ట్ కావడానికి ముందే ఫ్లిప్కార్ట్ ఈ డీల్ వివరాలను రివీల్ చేసింది. ఈ సేల్ లో కొనుగోలుదారులు క్యాష్‌బ్యాక్, ఈఎంఐ డీల్‌లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా జరిపే లావాదేవీలపై అదిరిపోయే డిస్కౌంట్‌లని పొందవచ్చు.

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భాగస్వామ్యంతో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో ఆపిల్, గూగుల్, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్‌లు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. నథింగ్ ఫోన్ 2ఎ, నథింగ్ 2ఎ ప్లస్, ఏసర్ అస్పైర్ 3పై కూడా అదిరిపోయే ఆఫర్‌లు ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ వంటి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంటుంది. ఇంకా అలాగే టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఆడియో డివైజ్‌లపై కూడా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించనుంది ఫ్లిప్కార్ట్. ఈ సేల్ లో ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా ఇస్తుంది..

ఫ్లిప్ కార్ట్ పే లేటర్ క్రెడిట్‌ను ఏకంగా రూ. 1 లక్ష దాకా అందిస్తుంది. అలాగే ఈ సేల్ లో తమ సూపర్ మనీ యాప్ ద్వారా యూపీఐ లైఫ్‌టైమ్ క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ప్రోడక్ట్ లని కొనుగోలు చేసేవారికి ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ బెనిఫిట్స్ ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఇంకా వీటి పైనే కాదు బట్టలపై కూడా అదిరిపోయే డిస్కౌంట్లు వుంటాయి. ఈ సేల్ లో బ్రాండెడ్ బట్టలు తక్కువ ధరకే రానున్నాయి. దాదాపు 50 శాతం దాకా డిస్కౌంట్లు పొందవచ్చు. ఇక కొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్న ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments