iDreamPost
android-app
ios-app

మరో కూకట్‌పల్లిగా ఆ ఏరియా.. ఇన్వెస్ట్ చేస్తే లక్షకు 8 లక్షలు లాభం!

  • Published Jun 10, 2024 | 3:55 PM Updated Updated Jun 10, 2024 | 3:55 PM

Another Kukatpally: రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బు సంపాదించాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఇక్కడ స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే ఊహించని లాభాలను చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు లక్ష ఇన్వెస్ట్ చేస్తే 8 లక్షలు లాభం వస్తుందని చెబుతున్నారు.

Another Kukatpally: రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బు సంపాదించాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఇక్కడ స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే ఊహించని లాభాలను చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు లక్ష ఇన్వెస్ట్ చేస్తే 8 లక్షలు లాభం వస్తుందని చెబుతున్నారు.

మరో కూకట్‌పల్లిగా ఆ ఏరియా.. ఇన్వెస్ట్ చేస్తే లక్షకు 8 లక్షలు లాభం!

డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా కొంచెం ఆలస్యం అయినా పర్లేదు భారీ లాభాలను పొందాలి అని అనుకుంటే ఉన్న ఒకే ఒక్క మార్గం భూమి. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు నాశనమైనట్టు చరిత్రలో లేదు. ఎంతోమంది భూమిని నమ్మి పెట్టుబడి పెట్టి కోటీశ్వరులయ్యారు. గజం 3 వేలకు, 4 వేలకు కొని ఇప్పుడు లక్ష, 2 లక్షలకు అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా వీళ్ళలా కోటీశ్వరులు అవ్వాలంటే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో పెట్టుబడి పెడితే తిరుగుండదని నిపుణులు చెబుతున్నారు. ఆ ఏరియా రానున్న రోజుల్లో మరో కూకట్ పల్లి అవుతుందని చెబుతున్నారు. పలు ఇండస్ట్రీలు వస్తాయని.. దీని వల్ల డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే రిలయన్స్, అమెజాన్ వంటి కంపెనీలు అక్కడ వర్క్ స్టార్ట్ చేశాయి. 3,600 ఎకరాల్లో ఇండస్ట్రీలు రానున్నాయి. 

ఆ ఏరియా పేరు షాబాద్. షాద్ నగర్ నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది. పైగా రీజనల్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరగా ఉండడంతో రేపు రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యాక సిటీకి కనెక్టివిటీ అనేది బాగుంటుంది. ఇప్పటికే రిలయన్స్, అమెజాన్, అదానీ, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఈ ఏరియాలో పనులు ప్రారంభించాయి. అలానే రెండు స్పెషల్ ఎకనామిక్ ఇండస్ట్రీ జోన్స్ వస్తున్నాయి. సీతారాంపూర్, చందనవెల్లి సెజ్ వస్తున్నాయి. 3600 ఎకరాల్లో ఈ రెండు సెజ్ లు వస్తున్నాయి. 3600 ఎకరాల్లో ఇండస్ట్రీలు పూర్తిగా రావడానికి ఐదేళ్లు పడుతుంది. ఈ ఐదేళ్ళలో అన్ని రంగాలకు చెందిన కంపెనీలు రానున్నాయని.. ప్రముఖ కంపెనీలు రాబోతున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

ఐదారేళ్లలో రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుతుందని.. పదేళ్లలో అయితే ఈ ఏరియా కూకట్ పల్లి, గచ్చిబౌలిగా మారనుందని అంటున్నారు. షాబాద్ లో ప్రస్తుతం చదరపు గజం 15 వేలు, 20 వేలు, 25 వేలుగా ఉన్నాయి. మెయిన్ రోడ్ కి దగ్గరగా కావాలనుకుంటే ధర ఎక్కువగా ఉంటుంది. కొంచెం లోపలకి కావాలనుకుంటే 15 వేల లోపు కూడా దొరుకుతాయని చెబుతున్నారు. ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్. ఇండివిడ్యువల్ ప్లాట్స్ అయితే ఇంకా తక్కువ ధరకే దొరుకుతాయని అంటున్నారు. 

షాబాద్ లో గజానికి 15 వేలు చొప్పున 150 గజాలు కొనుగోలు చేస్తే 22 లక్షల వరకూ అవుతుంది. పదేళ్ల తర్వాత ఈ పెట్టుబడి దాదాపు 2 కోట్లు అవుతుందని చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం పదేళ్లలో షాబాద్ ఏరియా కూకట్ పల్లిలా మారనుంది. ప్రస్తుతం కూకట్ పల్లిలో గజం లక్ష 30 వేలు పలుకుతుంది. ఇవే రేట్లు షాబాద్ లో రానున్న రోజుల్లో ఉంటాయని అంటున్నారు. మూడేళ్ళ క్రితం ఇక్కడ గజం స్థలం 3 వేలు, 4 వేలు, 5 వేలుగా ఉండేదని.. ఇప్పుడు 15 వేలు, 20 వేలు అయ్యిందని చెబుతున్నారు.

అంటే మూడేళ్ళ క్రితం 150 గజాల మీద 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారి స్థలం విలువ ఇప్పుడు 22 లక్షలు అయినట్టు. అంటే దాదాపు 18 లక్షలు లాభం వచ్చినట్టు. మూడేళ్ళలోనే ఇంత లాభం వచ్చిందంటే.. పదేళ్లలో ఇంకెంత లాభం వస్తుందో ఊహించుకోవచ్చు. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక షాబాద్ మంచి ఏరియా అని చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.