X Payments: ఎక్స్ మాధ్యమంలో కొత్త ఫీచర్! ఇక నుంచి లావాదేవీలు కూడా చేయొచ్చు!

X Payments: ఎక్స్ మాధ్యమంలో కొత్త ఫీచర్! ఇక నుంచి లావాదేవీలు కూడా చేయొచ్చు!

Elon Musk Master Plan: ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కి పోటీగా ఎలాన్ మస్క్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Elon Musk Master Plan: ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కి పోటీగా ఎలాన్ మస్క్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే సహా పలు పేమెంట్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ వచ్చిన కొత్తలో యూజర్స్ కి రివార్డ్ పాయింట్లు ఇచ్చేవి. ప్రమోషన్ లో భాగంగా ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్స్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ చేసేవి. అయితే ఇప్పుడు వీటికి పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్ ని డెవలప్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా మాధ్యమం అయిన ఎక్స్ ను ఆల్ ఇన్ వన్ యాప్ గా మార్చేందుకు ఎలాన్ మస్క్ విజన్ తో కొత్త విధానాలను, కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా పేమెంట్ ఫీచర్ ని తీసుకురానున్నారు. కొంతమంది యూజర్స్ తో పేమెంట్ సిస్టంని టెస్ట్ చేస్తున్నారు. నిమా వోవ్జి అనే కంపెనీ ఈ పేమెంట్స్ ఫీచర్ మీద పని చేస్తుంది.

బుక్ మార్క్స్ ట్యాబ్ కింద పేమెంట్స్ అనే కొత్త ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు యాప్ డెవలపర్ నిమా వోవ్జి వెల్లడించింది. లావాదేవీలు, బ్యాలన్స్, నగదు బదిలీ వంటి ఫీచర్స్ ని ఎక్స్ ఖాతాలో పరిచయం చేసేందుకు కంపెనీ పలు రిఫరెన్స్ లు కనుగొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఎక్స్ కంపెనీ మనీ పేమెంట్స్ కి సంబంధించి యూఎస్ లోని 33 రాష్ట్రాల్లో లైసెన్స్ పొందింది. పేమెంట్స్ సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది. గతంలో ఎలాన్ మస్క్ కూడా పేమెంట్స్ కి సంబంధించి తన ఆసక్తిని బయటపెట్టారు. యూజర్ కి డబ్బు దాచుకునే సదుపాయం కల్పించడం, ఆ డబ్బు మీద అధిక వడ్డీ ఇవ్వడం వంటి ఆశయాలు ఉన్నాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

అందుకోసం ఎక్స్ కంపెనీ కావాల్సిన లైసెన్సులను పొందడంలో బిజీగా ఉంది. ప్రకటనల ద్వారా ఎక్స్ కి ఆదాయం రావడం అనేది ఒక సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పేమెంట్ సేవలు ప్రారంభిస్తే ఎక్స్ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే కనుక నిజంగా ఒక కొత్త విప్లవం అయితే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఎక్స్ నుంచి పేమెంట్స్ చేసుకునే సదుపాయం వస్తే కనుక ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పైగా డబ్బు దాచుకునే సదుపాయం, దాని మీద ఎక్కువ వడ్డీ ఇవ్వాలని మస్క్ తన ఆసక్తిని ప్రకటించడం వంటి వాటి వల్ల ఎక్స్ పేమెంట్ సర్వీస్ కి ఆదరణ పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి ఎక్స్ వేదికను అన్ని రకాలుగా వాడుకునే యాప్ గా మార్చేస్తున్నారు ఎలాన్ మస్క్. మరి ఎక్స్ సోషల్ మీడియా మాధ్యమంలో పేమెంట్స్ ఫీచర్ ని తీసుకొస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.      

Show comments