nagidream
స్థలం లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థలాల రేట్లు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?
స్థలం లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థలాల రేట్లు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?
nagidream
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడేవారు ఉంటారు. బాగా ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించి దాచుకున్న డబ్బుతో స్థలాలు లేదా ఫ్లాట్ లు కొంటూ ఉంటారు. అయితే ప్రాపర్టీ ధరలనేవి ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ తగ్గడం అన్న మాట కనబడడం లేదు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు అయితే తగ్గిందని అంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ జోరుగా సాగిందని.. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ నెమ్మదించిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రాపర్టీ ధరలు బాగా తగ్గాయని చెబుతున్నారు. ఇది బయ్యర్స్ టైం అని.. 30 శాతం ధరలు పడిపోయాయని.. స్థలాల మీద గానీ ఇండ్ల మీద గానీ పెట్టుబడి పెట్టేవారికి ఇదే కరెక్ట్ టైం అని చెబుతున్నారు.
ఎలక్షన్స్ మూమెంట్ కావడం కూడా రేట్లు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. అటు ఏపీ జనరల్ ఎలక్షన్స్, ఇటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి నగదు లావాదేవీలు అనేవి కామన్. దీని వల్ల రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగా ఉందని చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ ఇలానే ఉండిపోతుందని అనుకోవడానికి వీల్లేదని.. హైదరాబాద్ నగరం అనేది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 4వ స్థానంలో ఉందని.. కాబట్టి మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాబోయే ఐదేళ్ళలో న్యూయార్క్, టెక్సాస్ నగరాలను హైదరాబాద్ తలపిస్తుందని చెబుతున్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయతగ్గ నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడి పెట్టాలి.. మంచి స్థలం కొనుక్కోవాలి అనుకునేవారికి ఇదే కరెక్ట్ టైం అని అంటున్నారు. 30 శాతం తగ్గడం అంటే చిన్న విషయం కాదు. కోటి రూపాయల ప్రాపర్టీ మీద 30 లక్షలు తగ్గినట్టే. ఇది నిజంగా మంచి అవకాశం. ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని కొనుక్కుంటే ఆ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చని అంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత ఈ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.
మరో గచ్చిబౌలిగా పేరొందిన విజయవాడ హైవే మీద స్థలాల మీద పెట్టుబడి పెట్టడం మంచి ఛాయిస్ అని చెబుతున్నారు. అలానే మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఎల్బీనగర్ వరకూ 8 లైన్ హైవే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ నిర్మాణం పూర్తయితే కనుక 20 ఏళ్ల తర్వాత చూడబోయే రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఈలోపే కనబడుతుందని చెబుతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ లో తక్కువ ధరకే ప్రాపర్టీ దొరుకుతుందని.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. అయితే తక్కువ ధరకే వస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదని.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.