Credit Card వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే చాలా డబ్బులు నష్టపోతారు!

Credit Card: క్రెడిట్ కార్డుని చాలా జాగ్రత్తగా వాడాలి. చాలా మంది సరిగ్గా వాడక చాలా డబ్బులు నష్టపోతుంటారు.

Credit Card: క్రెడిట్ కార్డుని చాలా జాగ్రత్తగా వాడాలి. చాలా మంది సరిగ్గా వాడక చాలా డబ్బులు నష్టపోతుంటారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా క్రెడిట్ కార్డ్ వాడకం బాగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్‌ తో ఎక్కువ పేమెంట్స్ చేస్తే, ఎక్కువ రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్ పొందడం కామన్. అందుకే చాలా మంది కూడా తమ క్రెడిట్ కార్డ్‌లను అవసరం ఉన్నా లేకపోయినా కూడా తెగ వాడేస్తూ ఉంటారు. అలాగే క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు చాలా మంది కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల చాలా డబ్బులు నష్టపోతుంటారు. ఇక ఇప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తప్పులు చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మనం కేవలం డెబిట్ కార్డ్ తో మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డ్ తో కూడా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయవచ్చు. ఇది చాలా మంచి ఫెసిలిటీ అని చాలా బ్యాంకులు రుద్దుతూ ఉంటాయి. ఎందుకంటే ఇలా చేస్తే వారికి లాభం. మీకు నష్టం. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ తో ATM నుండి డబ్బు విత్ డ్రా చేసుకుంటే వాడిన ఫస్ట్ డే నుండే 2.5 నుండి 3.5 % వరకు వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. మీరు విత్‌డ్రా చేసుకునే డబ్బుపై సంవత్సరానికి ఏకంగా 30 నుంచి 42% వడ్డీని బ్యాంకులు వసూలు చేయవచ్చు. దీంతో మీరు ఎక్కువ లాస్ అవుతారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ బిల్లును చెల్లించడానికి మీకు ఒక నెల టైమ్ ఇస్తారు. కానీ ఈ టైమ్ తర్వాత మీరు గడువు తేదీ పూర్తయ్యాక వడ్డీని కట్టాలి. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ తో విత్‌డ్రా చేసుకునే డబ్బుపై మొదటి రోజు నుంచే వడ్డీని కట్టాలి. ఈ రెండింటి వల్ల మీకు బాగా తడిసి మోపెడవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు అస్సలు చేయకండి.

విదేశాల్లో కూడా క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. చాలా మంది కూడా ఈ ఫీచర్ కి వావ్ అంటారు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా విదేశాల్లో బిల్లు కడితే ట్రాన్సిషన్ ఛార్జీ కట్టాలి. కాబట్టి మీరు విదేశాల్లో క్రెడిట్ కార్డు వాడకుండా ప్రీపెయిడ్ కార్డును వాడాలి. క్రెడిట్ కార్డులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక క్రెడిట్ కార్డ్ బిల్లును మరొక క్రెడిట్ కార్డ్ సహాయంతో కట్టవచ్చు. కానీ ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఫ్రీ కాదు. దీనికి కూడా బ్యాంక్ ఫీజు వసూలు చేస్తుంది. దీనివల్ల కూడా మీరు భారీగా డబ్బులు నష్టపోతారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ని వాడకూడదు..ఇలా ఈ తప్పులు చేస్తే కచ్చితంగా చాలా నష్టపోతారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడేవారు, క్రెడిట్ అప్లై చేసుకోవాలనుకునేవారు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments