nagidream
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి. పొరపాటున ఈ తప్పులు చేస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల జరిమానా కూడా పడుతుంది.
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి. పొరపాటున ఈ తప్పులు చేస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల జరిమానా కూడా పడుతుంది.
nagidream
పన్ను చెల్లించేవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే టైమొచ్చింది. అవగాహన లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం గానీ నిపుణుల ప్రమేయం లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం గానీ చాలా కష్టం. చాలా మంది ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఐటీ రిటర్న్స్ ఎలాంటి పొరపాట్లు లేకుండా దాఖలు చేస్తారు. అయితే కొంతమంది మాత్రం గడువు తేదీ దగ్గరపడేకొద్దీ కంగారులో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఐటీ రిటర్న్స్ లో చేసిన తప్పులను సరిచేసుకునే వీలు ఉంటుంది. రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా సరిచేసుకోవచ్చు. కానీ దీని వల్ల చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే మొదటిసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడే జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు తలెత్తవు.
ఏడు రకాల ఐటీ ఫారంలను సీబీడీటీ నోటిఫై చేసింది. వీటిలో మీకు కరెక్ట్ గా సెట్ అయ్యేదాన్ని ఎంచుకోవాలి. మీకు 50 లక్షల వరకూ జీతం, ఒక ఇంటిపై ఆదాయం, అలానే వడ్డీ తదితర మార్గాల్లో ఆదాయం వస్తుంటే గనుక ఐటీఆర్-1 దాఖలు చేయాలి. 50 లక్షలకు పైగా ఆదాయం ఉండి.. ఒకే ఇంటి ద్వారా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-2ని దాఖలు చేయాలి. వ్యక్తులకు గానీ, హిందూ అవిభాజ్య కుటుంబాలకు, సంస్థలకు 50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే కనుక ఐటీఆర్-4ని ఎంచుకోవాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్-3 ఫారంని ఎంచుకోవచ్చు. షేర్లు కొనడం, అమ్మడం చేసినప్పుడు మీరు చేసిన ట్రాన్సక్షన్స్ ఆధారంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా ఫారంలు కంపెనీలకు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.
ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ట్యాక్స్ పేయర్స్ తమ బ్యాంక్ ఖాతాలను ధృవీకరించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల ఖాతా యాక్టివ్ గా ఉందని ధ్రువీకరించడం అన్న మాట. అప్పుడే రిఫండ్స్ అనేవి జమ చేసేందుకు వీలుంటుంది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ట్యాక్స్ పేయర్లు దాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు అవుతుంది. ఐటీ రిటర్న్స్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోపు వెరిఫై చేయాలి. లేదంటే మీరు చేసిన ఐటీ రిటర్న్స్ ని పరిగణనలోకి తీసుకోరు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం.. వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీరు 1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, హోమ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియం వంటివన్నీ ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వీటి వివరాలను నమోదు చేస్తే మీకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలానే సెక్షన్ 80డీలో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. ఇక సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై కూడా 10 వేల రూపాయల వరకూ 80టీటీఏ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ వేతనంలో హెచ్ఆర్ఏ లేనట్లయితే సెక్షన్ 80జీజీ కింద అద్దె చెల్లింపులకు మినహాయింపు అనేది ఉంటుంది. పన్ను మినహాయింపు పొందాలంటే అన్ని రకాల పెట్టుబడులను, ఖర్చులను సరిగ్గా రిటర్న్స్ లో పేర్కొనాలి. లేదంటే అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కొంతమంది ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించరు. వడ్డీ, కమిషన్ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైల్ చేయకుండా వదిలేస్తారు. వీటి మీద టీడీఎస్ కట్ చేసి ఉంటారనుకుని రిటర్న్స్ లో దాఖలు చేయరు. దీని వల్ల తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఐటీఆర్ లో ప్రతి ఆదాయ మార్గాన్ని చూపించాలి.
ఐటీ రిటర్న్స్ ని గడువు తేదీలోపు పూర్తి చేయాలి. లేదంటే వెయ్యి నుంచి 5 వేల వరకూ పెనాల్టీ పడుతుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
కంపెనీలు టీడీఎస్ పేరుతో జీతంలో కొంత అమౌంట్ ని డిడక్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను వద్ద ఉన్న వివరాలతో మీ ఫారం-16లో ఉన్న వివరాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు. మీ వద్ద కంపెనీ వసూలు చేసిన పన్నుని ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోతే ఈ తేడా కనిపిస్తుంది. అందుకే రిటర్న్స్ దాఖలు చేసే ముందు ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, ఏఐఎస్ (వార్షిక సమాచార నివేదిక)లను పూర్తిగా పరిశీలించుకోవాలి. తేడా కనిపిస్తే సంస్థ దృష్టికి తీసుకెళ్లి సరి చేసుకోవాలి. ఇవే పొరపాట్లతో రిటర్న్స్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
ఐటీ రిటర్న్స్ లో అన్ని ఆదాయ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని ఖచ్చితంగా పేర్కొనాలి. కొంతమంది కేవలం జీతాన్ని మాత్రమే పేర్కొని.. బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు వంటి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని, పీపీఎఫ్ వడ్డీలను పేర్కొన్నారు. పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలను కూడా ఐటీ రిటర్న్స్ లో చూపించాలనే నిబంధనలు ఉన్నాయి. మైనర్ పిల్లల పేరు మీద పెట్టుబడులు పెట్టి.. వాటి ద్వారా ఆదాయం వచ్చినా కూడా రిటర్న్స్ లో ఫైల్ చేయాలి. లేదంటే ఆదాయపు పన్ను శాఖ గుర్తించి నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీ రిటర్న్స్ లో ఈ తప్పులేవీ జరక్కుండా చూసుకోండి.