Arjun Suravaram
నేటికాలంలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలానే త్వరలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నడటంతో పలు బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలానే తాజాగా ఓప్రముఖ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
నేటికాలంలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలానే త్వరలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నడటంతో పలు బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలానే తాజాగా ఓప్రముఖ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
ప్రస్తుతం ప్రతి ఒక్కరు డెబిట్, క్రెడిట్ లను వినియోగిస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే వీటి వినియోగానికి దూరంగా ఉంటున్నారు. అయితే బ్యాకింగ్ కి సంబంధించిన ఈ కార్డుల విషయంలో పలు నిబంధనలు ఉంటాయి. అలానే వీటిని వినియోగించినందుకు సర్వీస్ ఛార్జీ ఉంటుదన్న సంగతి తెలిసిందే. డెబిట్ కార్డు సర్వీస్ ఛార్జీలు అనేవి ఆయా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. అలానే తరచూ సర్వీస్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా ఓ ఎస్బీఐ బ్యాంకు డెబిట్ యూజర్లకు షాకిచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకింగ్ రంగంలోనే ఎస్బీఐ కీలకంగా ఉంటుంది. అలానే దేశంలోనే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. తన కస్టమర్లకు అనేక రకాల సదుపాయాలు అందిస్తుంది. అలానే కస్టమర్ల సంఖ్యను పెంచేందుకు ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేస్తుంది. ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తూ.. వినియోదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఎస్బీఐ డెబిట్ కార్డు వాడే వారికి ఆ బ్యాంక్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను సంబంధించి ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెబిట్ కార్డుల సర్వీస్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపింది. ఈమేరకు ఇటీవలే నిబంధనలను సవరించింది. డెబిట్ కార్డు సర్వీస్ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది.
అయితే అన్ని కార్డులకు ఒకటే ధర కాకుండా.. వివిధ ధరలను నిర్ణయించింది. వివిధ రకాల డెబిట్ కార్డుల ఉండే సంగతి తెలిసిందే. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ వంటి మరికొన్ని రకాల డెబిట్ కార్డులు ఉంటాయి. ఇక తాజాగా ఎస్బీఐ పెంచిన డెబిట్ యూజర్ల ధరలను ఇప్పుడు చూద్దాం.. సిల్వర్, గ్లోబల్, క్లాసిక్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ రుసుమును రూ.200లకు పెంచింది. గతంలో ఈ ఛార్జీలు రూ.125 ఉండగా వాటిని రూ.200లకు పెంచింది. అంటే.. 75 రూపాయలు అదనంగా పెంచింది. అలానే యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ ల నిర్వహణ ఛార్జీలను రూ.175 నుంచి రూ.250కి పెంచింది.
ప్లాటినం డెబిట్ కార్డుల విభాగంలోని ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రూ.325కు పెంచింది. గతంలో వీటి సర్వీస్ ఛార్జీలు రూ.250 ఉండేది. తాజాగా ఏకంగా రూ.75 పెంచి రూ.325 నిర్ణయించింది. ప్లాటినం బిజినెస్ కార్డుల ఛార్జీల విషయానికి వస్తే.. వీటి ధరలకు కూడా పెరిగాయి. ఫ్లాటినం బిజినెస్ కార్డు ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగాయి. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెంచిన డెబిట్ కార్డు సర్వీస్ ఛార్జీలు ఎప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలానే ఎస్‌బీఐ అందిస్తున్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపైన కూడా కొన్ని కొత్త నింబధనలు వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో గతంలో మాదిరిగా ఉన్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు. మరి.. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.