iDreamPost
android-app
ios-app

Credit Card యూజర్లకు అలర్ట్.. ఇక క్రెడ్, ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయలేరు.. ఎందుకంటే?

మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ముఖ్య గమనిక. ఇక క్రెడిట్ కార్డుతో క్రెడ్, ఫోన్ పే, బిల్ డెస్క్ ద్వారా పేమెంట్ చేయలేరు. ఆర్బీఐ కొత్త నిబంధ తీసుకొచ్చింది.

మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ముఖ్య గమనిక. ఇక క్రెడిట్ కార్డుతో క్రెడ్, ఫోన్ పే, బిల్ డెస్క్ ద్వారా పేమెంట్ చేయలేరు. ఆర్బీఐ కొత్త నిబంధ తీసుకొచ్చింది.

Credit Card యూజర్లకు అలర్ట్.. ఇక క్రెడ్, ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయలేరు.. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్యపెరుగుతున్నది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుండడంతో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరిగింది. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. తక్కువ శాలరీ ఉన్నా కూడా క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ఇతర పేమెంట్స్ అన్నీ కూడా చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక క్రెడిట్ కార్డు యూజర్లు క్రెడ్, ఫోన్ పే, బిల్ డెస్క్ ల ద్వారా పేమెంట్స్ చేయలేరు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను అతిక్రమించే బ్యాంకులపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఫేక్ పేమెంట్స్, మోసపూరిత లావాదేవీలను ట్రాక్ చేయడానికి కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇక క్రెడిట్ కార్డు పేమెంట్ల‌ను క్రెడ్, బిల్ డెస్క్, ఫోన్ పేల నుంచి చెల్లించలేరని తెలుస్తోంది. ఆర్బీఐ జారీ చేసిన కొత్త రూల్ ప్ర‌కారం జులై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డు బిల్లుల‌ను భార‌త్ బిల్ పేమెంట్ సిస్ట‌మ్ ద్వార‌నే చేయాల‌ని సమాచారం. బీబీపీఎస్‌లో సభ్యులుగా ఉన్న ఫోన్‌పే, క్రెడ్, బిల్ డెస్ట్ వంటి ఫిన్‌టెక్‌లు జూన్ 30 తర్వాత క్రెడిట్ కార్డ్ బకాయిలపై చెల్లింపులను ప్రాసెస్ చేయలేవు.

Cred

ఇప్పటి వరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు బిబిపిఎస్‌ని యాక్టివేట్ చేయలేదు. కోట్లాది మంది యూజర్లు ఈ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. జూన్ 30 త‌ర్వాత క‌స్ట‌మ‌ర్లు ఈ బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తుతోంది. ఈ కొత్త రూల్‌ను అమ‌ల్లోకి తెచ్చేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల‌కు 90 రోజుల గ‌డువు ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా క్రెడిట్ కార్డులు ఇస్తున్న 34 బ్యాంకుల నుంచి కేవ‌లం ఎనిమిది మాత్ర‌మే ఈ బీబీపీఎస్ ను యాక్టివేట్ చేసుకున్నాయి. బీబీపీఎస్‌ని యాక్టివేట్ చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ కార్డ్, బీఓబీ కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.