Venkateswarlu
క్రెడిట్ కార్డు అనేది ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే చాలా సమయం పట్టేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే వెంటనే క్రెడిట్ కార్డుని పొందవచ్చు.
క్రెడిట్ కార్డు అనేది ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే చాలా సమయం పట్టేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే వెంటనే క్రెడిట్ కార్డుని పొందవచ్చు.
Venkateswarlu
ప్రస్తుతం క్రెడిట్ కార్డు కూడా ఓ నిత్యావసరం అయిపోయింది. నెల నెలా స్థిరమైన ఆదాయం వచ్చే వారికి బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడ్డం లేదు. క్రెడిట్ కార్డు వల్ల లాభాలు బానే ఉండటంతో.. ఎక్కువ మంది వాటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి హామీ లేకుండా తక్షణమే నగదు పొందడానికి క్రెడిట్ కార్డు చాలా బాగా ఉపయోగపడుతోంది. వాడ్డం తెలిస్తే.. క్రెడిట్ కార్డును మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. దేశ వ్యాప్తంగా క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ఈ మధ్య డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గత నెల అక్టోబర్‌లో వీటి వాడకం రికార్డు స్థాయికి చేరినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే వినియోగదారులు ఒక్కోసారి కార్డులను వాడటంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల కారణంగా తీవ్ర పరిణామాలు సైతం ఎదుర్కొంటున్నారు. ఇలా జరక్కుండా ఉండాలంటే.. క్రెడిట్ కార్డుల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిన్ నంబర్: మీ క్రెడిట్ కార్డును పిన్ నంబర్‌తో సహా ఎవరికైనా ఇస్తే, వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కార్డు పరిమితి మేరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బులు కూడా విత్ డ్రా చేయవచ్చు. అందుకే.. దుకాణాలు, రెస్టారెంట్లలో ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు కార్డు పిన్ నంబర్ మీరే ఎంటర్ చేయాలి. పిన్ నంబర్ ఎవ్వరికీ చెప్పకూడదు. లేదంటే కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
పాస్‌వర్డ్: ఆన్‌లైన్ లాగిన్ వివరాలు, పాస్‌వర్డులు, సీవీవీ నంబర్ వంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఈ డేటా బయటికి తెలిస్తే కార్డు చోరీకి గురయ్యే ఆవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం పబ్లిక్ నెట్‌వర్క్‌ను ఉపయోగించొద్దు. ప్రతి 3 నుంచి 6 నెలలకు మీ క్రెడిట్ కార్డు పిన్, ఆన్‌లైన్ లాగిన్ పాస్ వర్డ్‌ను మార్చేయాలి.
రోజువారీ క్రెడిట్ లిమిట్: క్రెడిట్ కార్డు సంస్థలు తమ యాప్ లేదా ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ద్వారా.. క్రెడిట్ కార్డుపై ట్రాన్సాక్షన్ లిమిట్ నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తాయి. దేశీయ, విదేశీ ట్రాన్సాక్షన్లను నియంత్రించడం, రోజువారీ గరిష్ఠ వ్యయ పరిమితిని సెట్ చేసుకోవడం లాంటివి చేయవచ్చు. ఇలా అవసరం మేరకు మాత్రమే లిమిట్ సెట్ చేసుకుంటేనే మంచిది. ఇది జరగబోయే నష్టాన్ని కొంత వరకు నివారించుకోవచ్చు.
క్రెడిట్ స్కోరు, స్టేట్‌మెంట్ తనిఖీ: రోజు క్రమం తప్పకుండా మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, క్రెడిట్ స్కోరును తనిఖీ చేయాలి. వాటిలో తప్పులుంటే గుర్తించి దిద్దుబాటు చేసుకోవాలి. కార్డు ద్వారా రుణాలు తీసుకున్నవారు అన్ని ఈఎంఐలు చెల్లించేస్తే, క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది.
కార్డు సమాచారం: బ్యాంకు సంబంధించిన అధికారులు, కస్టమర్ కేర్ పేరుతో ఎవరైనా మీకు కాల్ చేసినప్పటికీ కార్డు వివరాలు తెలియజేయకూడదు. అవసరమైతే మీరే నేరుగా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.
కార్డు బ్లాక్: మీ కార్డుపై మోసపూరిత ట్రాన్సాక్షన్లు జరిగితే, తక్షణమే మీ కార్డు జారీ సంస్థను సంప్రదించి కార్డును బ్లాక్ చేయించాలి. మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ద్వారా కూడా ఆ పని చేయొచ్చు.