SNP
సొంతిల్లు ఉండాలనేది చాలా మంది పేద, మధ్య తరగతి వాళ్ల కల. కానీ, ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అయ్యే ముడిసరుకుల రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. తక్కువ ధరలో ఇళ్లు కట్టుకోవాలి అనుకునే వారికి.. ఈ బడ్జెట్ ఇళ్లు ఎంతో ఉపయోగపడతాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సొంతిల్లు ఉండాలనేది చాలా మంది పేద, మధ్య తరగతి వాళ్ల కల. కానీ, ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అయ్యే ముడిసరుకుల రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. తక్కువ ధరలో ఇళ్లు కట్టుకోవాలి అనుకునే వారికి.. ఈ బడ్జెట్ ఇళ్లు ఎంతో ఉపయోగపడతాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
మనకున్న స్థలంలో చిన్న ఇళ్లు.. అంటే ఒక బెడ్రూం, ఒక హాలు, ఒక చిన్న కిచెన్ ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలంటే.. ఎంత లేదన్న 7 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సిమెంట్, ఇసుక, ఇటుక, ఐరన్, కరెంట్ సామాన్, పెయింటింగ్ అబ్బో ఇలా చెప్పుకుంటూ.. పోతే డబ్బులు చింతపిక్కల్లా వెదచల్లాల్సిందే. వీటికి తోడు కట్టుబడి అదనం. పైగా ఈ రోజుల్లో సూతారి మేస్త్రీ, కూలీలు దొరకడమే గగనంగా మారింది. ఇళ్లు కట్టేందుకు ముగ్గేసిన దగ్గర్నుంచి.. ప్రతి పనికీ పైసలే. కొన్ని సార్లు.. బడ్జెట్ దాటిపోయి.. అప్పుల పాలు కూడా అయిపోతారు. అందుకే.. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. అయితే.. కాలం మారుతోంది. మనకున్న చిన్న స్థలంలోనే లక్షలకు లక్షలు పోసి.. ఇళ్లు కట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మార్కెట్‌లోకి కంటైనర్ ఇళ్లు వచ్చేశాయి. మనకున్న స్థలాన్ని బట్టీ.. మన అవసరాలకు తగ్గట్లు.. ఎలా కావాలంటే అలా ఏర్పాటు చేసుకోవచ్చు. సిమెంట్, ఇసుక, ఇటుక, సుతారి మేస్త్రీతో పనేలేదు. కనీసం పునాదులు కూడా తీయాల్సిన అవసరం లేదు. పైగా.. నెలల తరబడి పనులన్నీ మానుకోని.. ఇంటి నిర్మాణంలో చెమటలు చిందించాల్సిన పనేలేదు. జెస్ట్ అలా ఆర్డర్ ఇస్తే.. వారంలో రోజుల్లేనే ఇళ్లు డెలవరీ అయిపోతుంది. ఈ కంటైనర్ ఇళ్ల గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం..
చాలా మంది బడ్జెట్‌లో ఇళ్లు కట్టుకోవాలి అనుకుంటారు. అలాగే మరికొంతమంది రోడ్డు పక్కన ఖాలీ స్థలాల్లో చిన్న చిన్న బడ్డీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు పెట్టుకుని జీవనోపాధి పొందాలి అనుకుంటారు. కానీ, రోడ్డు పక్కన శాశ్వత నిర్మాణాలు చేయడానికి వీలుండదు. అలాంటి వారి కోసం ఈ కంటైనర్ ఇళ్లు ఒక వరం. చాలా తక్కవ ధరల్లో ఇనుముతో తయారు చేసే ఈ కంటైనర్ ఇళ్లు, స్టాల్స్ పేద, మధ్యతరగతి వాళ్లు చిన్నపాటి ఇళ్లు కట్టుకోవాలన్న, చిరు వ్యాపారులు చేసుకోవాలన్నా.. చాలా వరకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. అయితే.. ఈ కంటైనర్ ఇళ్లు, స్టాల్స్ అనేవి మన అవసరం ప్రకారం డిజైన్ చేయించుకోవచ్చు. అలాగే.. మనకు ఏ విధంగా కావాలో.. ఎలాంటి సౌకర్యాలు అవసరమో వాటికి తగ్గట్లు తయారు చేయించుకోవచ్చు. బెడ్రూం, హాల్, కిచెన్, వాష్ రూమ్ ఇలా.. అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
సెక్యూరిటీ క్యాబిన్ నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు ఈ కంటైనర్ నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇనుము, స్టిల్‌తో చేస్తారు కదా.. ఇనుముకు తమ్ము పట్టి త్వరగా పాడవుతుందనే టెన్షన్ కూడా లేదు. పక్కా గ్యారెంటీతో పెయింటింగ్ వేసి మరీ మనకు ఇళ్లను డెలవరీ చేస్తారు. లోపల అందంగా పెయింటింగ్ వేసి, అలాగే వేడి లేకుండా టాప్‌లో ప్రత్యేక వస్తువులతో నిర్మిస్తారు. సెక్యూరిటీ స్టాల్స్, టీ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, ఇళ్లు ఇలా వివిధ రకాలుగా ఈ కంటైనర్ నిర్మాణాలను వాడుకోవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించే అవకాశం ఉంటుంది. మనకున్న స్థలంలో పెద్ద ఇళ్లు పర్మినెంట్‌గా కట్టుకునే స్థోమత ఇప్పుడు లేకపోయినా.. భవిష్యత్తులు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా.. అప్పటి వరకు అదే స్థలంలో ఈ కంటైనర్ ఇళ్లు ఏర్పాటు చేసుకుని.. భారీ భారీ అద్దెల నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే భూమి విలువ పెరిగే దాకా.. అదే ల్యాండ్‌లో ఈ కంటైనర్ ఇళ్లు ఏర్పాటు చేసి.. అందులోనూ ఉంటూ.. ల్యాండ్‌కు మంచి రేట్ వచ్చిన తర్వాత కంటైనర్ హౌజ్‌ను వేరే చోటుకి తరలించి.. ల్యాండ్‌ను అమ్ముకోవచ్చు. అయితే.. ఈ కంటైనర్ ఇళ్లు రూ.40 వేల నుంచి రూ.10 లక్షల ధర వరకు అందుబాటులో ఉన్నాయి. పైగా మన హైదరాబాద్, బహుదూర్ పల్లిలో కూడా వీటిని తయారు చేసే కంపెనలు ఉన్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుంటుబాలు ఒక రెండు లక్షల్లో ఈ కంటైనర్ ఇళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా అందులోనే పెయింటింగ్, కరెంట్ సామాన్లు అంతా వస్తాయి. మరి ఈ కంటైనర్ ఇళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.