Gas Cylinder: సామాన్యుల నెత్తిన పిడుగు.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Commercial Gas Cylinder Price Hike: నెల ప్రారంభం అయ్యింది.. దాంతో చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు నెలలో గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. ఆ వివరాలు..

Commercial Gas Cylinder Price Hike: నెల ప్రారంభం అయ్యింది.. దాంతో చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు నెలలో గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. ఆ వివరాలు..

నెల ప్రారంభం అయ్యిదంటే చాలు కొన్ని అంశాల్లో మార్పులు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు, బ్యాంకులకు సంబంధించిన రూల్స్‌, గ్యాస్‌ సిలిండర్‌ వంటి వాటి ధరలు నెల ప్రారంభంలో మార్పులు చేర్పులకు గురవుతుంటాయి. ఇక ఈ నెల అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు ముఖ్య కారణం.. గత నెల అనగా జూలైలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దాంతో అనేక ఆర్థిక అంశాలకు సంబంధించి నియమనిబంధనలు మారాయి. అలానే నెల ప్రారంభం అయ్యిందంటే చాలు.. ఫస్ట్‌ తారీఖున గ్యాస్‌ సిలీండర్‌ ధరలు మారుతుంటాయి. చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలకు సంబంధించి.. ప్రతి నెల ప్రారంభం రోజున నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే ఆగస్టు 1న కూడా గ్యాస్‌ సిలిండర్‌ ధరలకు సంబంధించి ఆయిల్‌ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను బాగా పెంచాయి. ఆ వివరాలు..

ఆగస్టు నెల ప్రారంభమైందో లేదో.. దేశ ప్రజలకు భారీ షాక్ తగిలింది. గత నెల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ప్రభావంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచాయి. బడ్జెట్‌ తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ రేటు తగ్గుతుందని భావించారు. కానీ అందుకు భిన్నమైన సీన్‌ కనిపించింది. అయితే ఇక్కడ కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. చమురు కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటును పెంచాయి కానీ.. గృహ వినియోగం కోసం వాడే గ్యాస్‌ సిలిండర్‌ రేటును పెంచలేదు. మరి నేడు చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఎంత మేర పెంచాయి అంటే..

చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచగా.. 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఐఓసీఎల్‌ వెబ్‌సైట్ ప్రకారం దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ల కొత్త ధరలు ఆగస్టు 1, 2024 ఉదయం 6 గంటల నుండి అమలులోకి వచ్చాయి. పెంచిన ధర తర్వత..  ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1646 నుండి రూ.1652.50కి పెరిగింది. అంటే రూ.6.50 చొప్పున పెంచారు. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది.

అంటే ఇప్పటి వరకు కోల్‌కతాలో రూ. 1756కు లభించే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ రేటు ఇప్పుడు రూ. 1764.5కి లభిస్తుంది. ముంబైలో రూ.1598గా ఉన్న ఈ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1605కి పెరిగింది. అలానే చెన్నైలో కూడా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటు పెరిగింది. నిన్నటి వరకు ఇక్కడ రూ.1809.50కి లభించే కమర్షియల్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1817కి చేరింది.

Show comments