iDreamPost
android-app
ios-app

కేంద్రం స్కీమ్.. అర్జెంటుగా డబ్బులు కావాలా?.. రూ.50 లక్షల వరకు పొందే ఛాన్స్..

PMEGP: మీరు మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారా? అయితే కేంద్రం నుంచి 50 లక్షలు పొందే ఛాన్స్ వచ్చింది. కేంద్రం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) పథకాన్ని తీసుకొచ్చింది.

PMEGP: మీరు మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారా? అయితే కేంద్రం నుంచి 50 లక్షలు పొందే ఛాన్స్ వచ్చింది. కేంద్రం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) పథకాన్ని తీసుకొచ్చింది.

కేంద్రం స్కీమ్.. అర్జెంటుగా డబ్బులు కావాలా?.. రూ.50 లక్షల వరకు పొందే ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అదిరిపోయే స్కీములను ప్రవేశపెడుతోంది. ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆర్థిక సాయం అందించే స్కీములను తీసుకొస్తున్నది. ఈ స్కీముల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా చేయూతనందిస్తుంది. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్రం కృషి చేస్తున్నది. ఈ పథకాలను ఉపయోగించుకుని జీవితాల్లో వెలుగులు నింపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రతి ఏడు లక్షలాది మంది నిరుద్యోగులు డిగ్రీ పట్టాలు అందుకుని బయటికి వస్తున్నారు. వీరందరికి ఉద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి స్కిల్స్ పెంపొందించుకునేలా చేస్తున్నది.

యువతకు ఉపాధి మార్గాలను కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు లోన్ అందించేందుకు రెడీ అయ్యింది. కేంద్రం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులకు 50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది. ఈ లోన్ ను ఉపయోగించుకుని ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఈ పథకం కింద కొత్త‌గా ఏర్పాటు చేసే చిన్న‌, సూక్ష్మ‌, కుటీర ప‌రిశ్ర‌మ‌ల యూనిట్ల మొద‌లు మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ స్థాయి వ‌ర‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం అంద‌జేస్తారు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకం ద్వారా యూనిట్‌కు లక్ష రూపాయల నుంచి రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో 35 శాతం వరకు రాయితీ ఉంటుంది. సర్వీసు యూనిట్లకు ఈ పథకం కింద సుమారు 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఇందులో మీరు 7 లక్షల వరకు కట్టాల్సిన పనిలేదు. ఈ పథకం కింద రుణం లభించాలంటే ముందుగా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ కూడా సామాజిక వర్గాల వారిగీ ఈ పెట్టుబడి మొత్తం మారుతుంటుంది. ఈ పథకం కింద రుణం పొందాలనుకుంటే.. జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది.

ఇక.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే జనరల్‌ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం కింద అందజేస్తారు. అలానే వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అయితే ఈ పథకం కింద 95 శాతం మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులే. ఈ పథకం కింద లోన్‌ పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్‌కు చెందిన వారితో కలిపి)కూడా ఈ పథకానికి అర్హులే.

ఈ పథకం కింద రుణం పొందాలంటే.. ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://kviconline.gov.in/ క్లిక్‌ చేసి పీఎంఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన వెంటనే 15 రోజుల వ్యవధిలో అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీ ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి. ఈ పథకాన్ని యూజ్ చేసుకుని మీరు వ్యాపారస్తులుగా రాణించొచ్చు. అదే సమయంలో మరో నలుగురికి ఉపాధి కల్పించే వీలుంటుంది.