Tirupathi Rao
Central Government Scheme Full Details: కేంద్రం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రజలకు అందిస్తోంది. వాటిలో ఒక గొప్ప పథకం ఉంది. దానిలో మీరు నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. నెలకు రూ.5 వేలు పొందవచ్చు.
Central Government Scheme Full Details: కేంద్రం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రజలకు అందిస్తోంది. వాటిలో ఒక గొప్ప పథకం ఉంది. దానిలో మీరు నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. నెలకు రూ.5 వేలు పొందవచ్చు.
Tirupathi Rao
ఉద్యోగం చేసినన్ని రోజులు జీతం వస్తుంది. వచ్చిన జీతంతో కుటుంబం సాఫీగా సాగిపోతుంది. మరి.. రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులకు దిగులు లేకుండా పెన్షన్ వస్తుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్ వస్తాయి. కానీ, ఎప్పుడైనా అసంఘటిత కార్మికుల పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? మీరే అసంఘటిత కార్మికులు అయితే ఆరు పదుల దాటిన తర్వాత ఆదాయం ఎలాగా అనే ప్రశ్న వేసుకున్నారా? అలాంటి అసంఘటిత కార్మికుల కోసం ఇప్పటికే కేంద్రం నుంచి అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. మరి.. ఆ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ అందించాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ అటల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. 2015లోనే దీనికి సంబంధించి ప్రకటన చేశారు. అప్పట్లో ప్రకటించిన 3 సామాజిక భద్రతా పథకాల్లో ఇది కూడా ఒకటి. ఈ అటల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లు 60 ఏళ్లు దాటిన తర్వాత వారు పెట్టిన పెట్టుబడికి తగిన విధంగా తగిన మొత్తాన్ని పెన్షన్ కింద పొందుతూ ఉంటారు. ఈ స్కీమ్ కింద ఇప్పటికే 5 కోట్లకు పైగా నమోదు చేసుకున్నారు. ఈ స్కీమ్ లో చేరేందుకు ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం.
ఈ స్కీమ్ లో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. అలాగే ట్యాక్స్ పేయర్లకు ఈ స్కీమ్ లో చేరే అర్హత లేదు. అలానే ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చే వారికి కూడా ఈ స్కీమ్ లో చేరే అర్హత లేదు. ఈ స్కీమ్ లో చేరేందుకు పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకులో కచ్చితంగా అకౌంట్ ఉండాలి. మీరు తప్పకుండా 40 ఏళ్లలోపు మాత్రమే ఈ స్కీమ్ లో చేరాలి. ఈ స్కీమ్ లో చెల్లించాల్సిన మొత్తం మీ వయసును బట్టి మారుతూ ఉంటుంది. మీరు చెల్లించిన మొత్తానికి తగిన విధంగా ప్రతి నెలా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.5 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. మీ వయసు 18 ఏళ్లు అయితే మీరు మీకు 60 వచ్చే వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వాళ్లు రూ.42 నుంచి గరిష్టంగా 210 రూపాయల వరకు చెల్లించవచ్చు. అలా చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.5000 పెన్షన్ కింద పొందవచ్చు.
40 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరేవాళ్లు 20 ఏళ్లపాటు ఈ అటల్ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వాళ్లు రూ.291 నుంచి గరిష్టంగా నెలకు రూ.1454 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.1,454 చెల్లించిన వారికి రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల పెన్షన్ దక్కుతుంది. మీరు బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయచ్చు. ఆన్ లైన్ లో కూడా ఎన్ఎస్డీఎల్ వెబ్ సైట్ ద్వారా ఖాతాను తెరిచే వీలుంది. మీ ఈ ఖాతా ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ కి ఎలాంటి ఫీజు ఉండదు. అలాగే అకౌంట్ ఓపెన్ చేసేందుకు రూ.15, మెయిన్టినెన్స్ కోసం రూ.20 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఈ పథకంలో చేరితే నెలకు కేవలం రూ.210తోనే నెలకు రూ.5 వేలు పొందే ఛాన్స్ ఉంది.