BSNL: మార్కెట్ లో BSNL దూకుడు! AIRTEL, JIOకి షాక్ ఇస్తూ మరో సంచలన నిర్ణయం!

ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతున్న మొబైల్ యూజర్లకు తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఓ గుడ్ న్యూస్ అందించింది. అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ టెలికాం సంస్థలైనా ఎయిర్టెల్, జియో, ఐడియా టెలికాం సంస్థలకు భారీ షాక్ తగలనుంది. అంతేకాకుండా.. ఆయా టెలికాం ఆపరేటర్లకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీనిచ్చేలా ఉంది.

ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతున్న మొబైల్ యూజర్లకు తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఓ గుడ్ న్యూస్ అందించింది. అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ టెలికాం సంస్థలైనా ఎయిర్టెల్, జియో, ఐడియా టెలికాం సంస్థలకు భారీ షాక్ తగలనుంది. అంతేకాకుండా.. ఆయా టెలికాం ఆపరేటర్లకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీనిచ్చేలా ఉంది.

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరికి మొబైల్ వినియోగం తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే.. ఫోన్లకు రీఛార్జ్ చేయడం కూడా కామన్ అయిపోయింది. అయితే ఒకవేళ ఫోన్ కు రీఛార్జ్ లు చేయకపోతే ఆయా టెలికాం నెట్ వర్క్ సంస్థలు సర్వీసులు నిలిపివేస్తున్నారు. దీంతో మొబైల్ కు రీఛార్జ్ తప్పనిసరిగా మారింది.కానీ, ఇప్పుడు ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచేశాయి. దీంతో మొబైల్ యూజర్లకు రీఛార్జ్ ల పెంపుతో మరింత ఆర్థికభారంగా మారింది. అయితే ఈ పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతున్న మొబైల్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఓ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలతో పాటు రీఛార్జ్ ప్లాన్ లు కూడా విడుదల చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే ఎయిర్టెల్, జియో, ఐడియా టెలికాం సంస్థలు రీఛార్జ్  ధరలు పెరిగడంతో మొబైల్ యూజర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక వైపు ఈ ప్రైవేట్ టెలికాం సంస్థలు ధైర్యంగా రీఛార్జ్ ఫ్లాన్స్ పెంచుకొని ముందడుగు వేస్తున్న వేళ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం రీఛార్జ్ ధరల పెంపు విషయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కస్టమర్లు ఆ నెట్ వర్క్ మారుదమని ఆలోచన చేస్తున్నా.. ఆ సంస్థలో ఇంక నెట్ వర్క్ అప్ గ్రేడ్ అనేది పెరగడంలేదు. కాగా, మిగిలిన ప్రైవేట్ సంస్థలు 5జీ నెట్ వర్క్ తో మార్కెట్ లో ముందంచులో ఉంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం నెట్ వర్క్ విషయంలో వెనకడుగులో ఉంది. ఈ క్రమంలోనే BSNL సంస్థ మొబైల్ యూజర్లకు ఆకర్షించుకొనేందుకు ముందడగు వేసింది.

ఈ నేపథ్యంలోనే.. BSNL టెలికాం సంస్థ తాజాగా మొబైల్ యూజర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదేమిటంటే..  బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి 4G సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఇటీవల సుమారు 10000 టవర్లను అప్‌గ్రేడ్‌ చేసింది. దీని ఫలితంగా ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. తాజాగా BSNL తన సోషల్‌ మీడియా ద్వారా 4G సర్వీసులకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. ఇక యూట్యూబ్‌ వీడియో ద్వారా 4G రీఛార్జ్‌ ప్లాన్‌ల వివరాలను కూడా వెల్లడించింది. ఇకపోతే ఈ BSNL 4G ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 4G డేటా సర్వీసులతో సహా ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌, మ్యూజిక్‌ వంటి వాల్యూ యాడెడ్‌ సర్వీసులను కూడా పొందవచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన 4G నెట్‌వర్క్‌ గురించి వివరించింది.  మరి ఆ రీఛార్జ్ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

PV2399 : ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ ద్వారా 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.  అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ తో సహా రోజువారీ 100 SMS వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజు ఈ ప్లాన్ లో 2GB డేటాను పొందవచ్చు. ఇలా మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో 790GB డేటాను పొందవచ్చు.

 PV1999 : ఇక ఈ రీఛార్జ్  ప్లాన్‌ 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. కాగా, ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 600GB డేటాను వినియోగించుకోవచ్చు.

PV1999 :  ఈ రీఛార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అలాగే మొత్తంగా 600GB డేటాను  వినియోగించుకోవచ్చు.

PV997 :  ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ తో సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. పైగా రోజువారీ 2GB డేటాను కూడా  వినియోగించుకోవచ్చు.  ఇకపోతే ఈ ప్లాన్ లో 160 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అనగా మొత్తం మీద 320GB డేటాను పొందవచ్చు.

STV599 : ఈ  ప్రీపెయిడ్‌ రీఛార్జీ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. పైగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ తో సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఇందులో భాగంగానే రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ఇలా మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు.

STV347 :  ఇక ఈ BSNL రీఛార్జ్‌ ప్లాన్ గడువు 54 రోజులుగా ఉంటుంది. కాగా, ఇందులో  అన్‌లిమిటెడ్‌ కాలింగ్ తో సహా రోజువారీ 100 SMS లను ఉచితంగా పొందడమే కాకుండా.. ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు.  ఇలా మొత్తంగా 108GB డేటాను పొందవచ్చు.

PV199 : ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ తో సహా ప్రతిరోజు 100 SMS లతో పాటు 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ గడువు 30 రోజులు మాత్రమే ఉంటుంది.  ఇలా మొత్తంగా 60GB డేటాను ఇందులో  వినియోగించుకోవచ్చు.

PV153 : ఇక ఈ ప్లాన్ గడువు కేవలం  26 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక ఇందులో ప్రతి రోజు 1GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ తో సహా..  రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

STV118:  ఈ  ప్లాన్‌ ద్వారా 20 రోజుల వ్యాలిడిటీని కూడా పొందవచ్చు.  ఇందులో మొత్తంగా 10GB డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు.  అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది.

Show comments