50 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చేసిన BSA గోల్డ్ స్టార్! ఫీచర్స్ సూపర్!

50 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చేసిన BSA గోల్డ్ స్టార్! ఫీచర్స్ సూపర్!

BSA GoldStar 650: 1970 నాటి కాలంలో BSA గోల్డ్ స్టార్ బైక్స్‌ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఓ రేంజిలో సందడి చేశాయి. అప్పటి యూత్ ని ఈ బైక్స్ ఉర్రూతలూగించేవి.

BSA GoldStar 650: 1970 నాటి కాలంలో BSA గోల్డ్ స్టార్ బైక్స్‌ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఓ రేంజిలో సందడి చేశాయి. అప్పటి యూత్ ని ఈ బైక్స్ ఉర్రూతలూగించేవి.

వింటేజ్ బైక్ BSA గోల్డ్ స్టార్ 650 (BSA GoldStar 650) భారతదేశంలో మళ్ళీ అధికారికంగా విడుదల అయ్యింది. ఈ మోటార్‌సైకిల్ అప్డేటెడ్ క్లాసిక్ మోడల్‌లో ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ మార్కెట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్‌ను మహీంద్రా గ్రూప్‌కు సంబంధించిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CLPL) ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ BSA మోటార్‌సైకిల్ బ్రాండ్ కోసం CLPL మరో జాయింట్ వెంచర్‌ను సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ మోటార్ సైకిల్ ని రిలీజ్ చేశారు. 1970 నాటి కాలంలో ఈ బైక్స్‌ మార్కెట్‌లో ఓ రేంజిలో సందడి చేశాయి. మళ్ళీ ఇప్పుడు ఏకంగా 50 సంవత్సరాల తర్వాత అదే క్లాసీ లుక్‌తో ఇండియన్‌ మార్కెట్‌లో ఈ వింటేజ్ బైక్ విడుదల అయ్యింది.

ఈ సూపర్ బైక్‌ ధర విషయానికి వస్తే.. రూ . 3,02,134 (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ మోటార్‌సైకిల్‌ కి పోటీ ఇస్తుంది. ఈ బైక్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 650 బైక్స్‌ లాగానే రెట్రో థీమ్ మోటార్ సైకిల్‌గా ఉంటుంది. అంతేకాక ఈ మోటార్ సైకిల్‌ ని 1970ల నాటి బైక్‌ లాగే బీఎస్‌ఏ కంపెనీ డిజైన్ చేసింది. మంచి రాయల్‌ లుక్‌ ఈ బైక్ సొంతం. దీని ఫీచర్ల విషయానికొస్తే ఈ బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 LCD డిస్ప్లే, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్, యుఎస్బి ఛార్జర్, LED టెయిల్ల్యాంప్ లని కలిగి ఉంది. ఇది 650 సీసీ మోటార్ సైకిళ్ల లాగే ప్యార్లల్ -ట్విన్ ఇంజిన్‌తో కాకుండా సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6,000 rpm వద్ద 45 bhp పవర్ ని మరియు 4,000 rpm వద్ద 55 nm మాక్సిమం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 650 ట్విన్స్ లాగే బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 మోటార్ సైకిల్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ 5-స్పీడ్ గేర్ బాక్స్ సిటీల్లో ఇంకా కఠినమైన రోడ్లలో కూడా పవర్‌ట్రెయిన్‌కి సరిపోతుంది. అందువల్ల సౌకర్యంగా వెళ్ళవచ్చు.ఈ బైక్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ బైక్ వెనుక భాగంలో 5-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లను కలిగి ఉంటుంది.. ఈ బైక్ కి ముందు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 255 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ముందు 18 అంగుళాల వీల్ , వెనుక 17 అంగుళాల వీల్ ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఇక బరువు విషయానికి వస్తే.. దీని బరువు 201 కిలోలు ఉంటుంది. ఈ బైక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments