బడ్జెట్ ధరలో SUV కార్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

SUV Cars: ఎస్యూవీ కార్స్ కొనాలని చాలా మంది అనుకుంటారు. బడ్జెట్ ధరలో మంచి ఎస్యూవీ కార్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి 10 లక్షల ధర లోపు మంచి ఫీచర్లు కలిగి ఉంటాయి.

SUV Cars: ఎస్యూవీ కార్స్ కొనాలని చాలా మంది అనుకుంటారు. బడ్జెట్ ధరలో మంచి ఎస్యూవీ కార్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి 10 లక్షల ధర లోపు మంచి ఫీచర్లు కలిగి ఉంటాయి.

చాలా మందికి కార్ కొనాలని ఆశ ఉంటుంది. అందులోనూ ఎస్యూవీ కార్స్ కొనాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇంకా స్టైలిష్ డిజైన్ ని కలిగి ఉంటాయి. ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అలాగే ఈ కార్లు మంచి ఫీచర్లతో వస్తాయి. అయితే ఈ కార్ల ధరలు మాత్రం మిగతా కార్లతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అయితే బడ్జెట్ ధరలో మంచి ఎస్యూవీ కార్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి 10 లక్షల ధర లోపు ఉంటాయి. ఇంకా మంచి ఫీచర్లు కలిగి ఉంటాయి. ఇప్పుడు ప్యాసెంజర్స్ సౌకర్యంగా ప్రయాణించగల మంచి ఎస్యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్టర్: ఈ ఎస్యూవీ కార్ అత్యంత సరసమైన బడ్జెట్లో దొరికే కార్లలో ఒకటి. ఈ కార్ ₹6.13 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్ వేరియంట్ 10.43 లక్షల దాకా ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. దీనిలో మంచి ఫీచర్లు ఉంటాయి. దీనిలో ఆకట్టుకునే ఫీచర్ ఏంటంటే.. దీని సన్ రూఫ్. అయితే ప్రత్యేకంగా సన్‌రూఫ్ ఫీచర్‌ కావాలంటే.. దీని ధర 8.23 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఇది 19.2 కిలో మీటర్ల నుంచి 19.4 కిలో మీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. ఇది 1197 సీసీ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ కార్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.

టాటా పంచ్: టాటా కంపెనీ ప్రవేశపెట్టిన బెస్ట్ కార్లలో ఇది ఒకటి. ఈ కార్ అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ కార్ మంచి ఫీచర్లతో, మంచి బిల్డ్ క్వాలిటీతో డిజైన్ చేయబడింది. ఇది 5 స్టార్ రేటింగ్ కలిగిన సేఫెస్ట్ కార్. ఇది 1199 సిసి ఇంజిన్ తో వస్తుంది. ఈ కార్ కూడా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 18.8 – 20.09 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ కార్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఇక ఈ కార్ ధర విషయానికి వస్తే.. ఇది 6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కార్ హై ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే..10.20 లక్షల దాకా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ: ఈ కార్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఇది 998 సీసీ, 1493 సీసీ ఇంజిన్ లని కలిగి ఉంటుంది. దీనికి సీఎన్జీ ఆప్షన్ లేదు. ఇది కేవలం డీజిల్, పెట్రోల్ ఆప్షన్ లతో వస్తుంది. ఇది ఏకంగా 24.2 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కార్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ కార్ 7 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 13.48 లక్షల దాకా ఉంటుంది. 10 లక్షల లోపు కూడా మంచి ఫీచర్లతో ఈ కారుని కొనుగోలు చేయవచ్చు. దీన్ని సూపర్ స్టైలిష్ గా డిజైన్ చేశారు. అందువల్ల ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Show comments