Raksha Bandhan 2024: రాఖీ పూర్ణిమ: ఈ రాఖీలు ఎవరూ కట్టి ఉండరు.. మీరు కడితే స్పెషల్‌గా నిలుస్తారు!

Best Rakhis For Brothers: రాఖీ పండుగ వచ్చేస్తుంది. తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఎంతో ప్రేమతో జరుపుకునే వేడుక ఇది. అలాంటి వేడుకలో సోదరుల కోసం బెస్ట్ రాఖీలు కట్టాలని ప్రతి అక్కా, ప్రతి చెల్లి అనుకుంటారు. అలా అనుకునే సోదరీమణుల కోసం మీ సోదరులకు కట్టేందుకు బెస్ట్ రాఖీలను తీసుకొచ్చాము.

Best Rakhis For Brothers: రాఖీ పండుగ వచ్చేస్తుంది. తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఎంతో ప్రేమతో జరుపుకునే వేడుక ఇది. అలాంటి వేడుకలో సోదరుల కోసం బెస్ట్ రాఖీలు కట్టాలని ప్రతి అక్కా, ప్రతి చెల్లి అనుకుంటారు. అలా అనుకునే సోదరీమణుల కోసం మీ సోదరులకు కట్టేందుకు బెస్ట్ రాఖీలను తీసుకొచ్చాము.

రాఖీ పండుగ వస్తుంది. రాఖీ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగ ఆగస్టు 19న సోమవారం నాడు వచ్చింది. తోడబుట్టిన అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములే శ్రీరామరక్ష అని భావించి అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీలు కడతారు. అయితే కొంతమంది సింపుల్ గా ఉండే రాఖీలు కడతారు. కొంతమంది కొంచెం ఎక్కువ ధర పెట్టి కొన్న రాఖీలు కడతారు. ఇక్కడ ధర ముఖ్యం కాదు.. కట్టిన రాఖీనే ముఖ్యం. రాఖీ కట్టడం వెనుక ఉన్న అక్క, చెల్లి ప్రేమే ముఖ్యం. అయినప్పటికీ కొంతమంది ఎక్కువ ధర పెట్టి మంచి రాఖీలు కొందామని అనుకుంటారు. కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నవారు తక్కువ ధరకే రాఖీలు కొని కట్టేస్తుంటారు. మరి కొంతమంది తాము పెట్టే డబ్బుతో బెస్ట్ రాఖీలు వస్తాయని తెలియక కొన్ని మంచి రాఖీలు కొనలేరు. అయితే ఇవాళ ఈ కథనంలో మీరు మీ అన్నయ్యల కోసం, తమ్ముళ్ల కోసం మంచి రాఖీలను కట్టవచ్చు. 

రాఖీ అనేది ఒకరోజులో పెట్టుకుని తీసేసేలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఎప్పటికీ పెట్టుకునే రాఖీలను కడితే చాలా బాగుంటుంది కదా. అన్నయ్య పేరు లేదా తమ్ముడి పేరు ఉన్న రాఖీ కడితే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి రాఖీలు కావాలంటే ఎక్కడ చేస్తారు? ఎవరు చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని షాప్స్ తిరగాలి? ఇలా లెక్కలు మీ మదిలో మెదిలితే కనుక వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. అదే ఆన్ లైన్. ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో ఇప్పుడు మీ రాఖీలను మీరే స్వయంగా నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే ముందు మీ అన్నయ్య లేదా తమ్ముడి పేరుతో లేదా మీ ఇద్దరి పేరుతో కలిపి రాఖీని తయారు చేయించుకోవచ్చు.

స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో వస్తున్న ఒక ప్లేట్ మీద పేరుని ముద్రించి రాఖీని ఇస్తారు. ఈ రాఖీల అసలు ధర రూ. 999 కాగా ప్రస్తుతం ఆఫర్ లో రూ. 199 పడుతుంది. ఈ రాఖీలను కొనుగోలు చేసే ముందు కస్టమైజ్ ఆప్షన్ లోకి వెళ్లి పేరు టైప్ చేయాలి. అక్కడ మీకు నచ్చిన ఫాంట్స్ ని ఎంపిక చేసుకోవాలి. రాఖీతో పాటు గిఫ్ట్ బాక్స్, చాక్లెట్ ఇవ్వాలంటే కనుక వాటిని ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గిఫ్ట్ బాక్స్ 60 రూపాయలు, చాక్లెట్ 60 రూపాయలు.. రెండూ ఎంచుకుంటే 120 రూపాయలు. మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి పేరుతో ఉన్న రాఖీని కడితే కనుక మీరు చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. ఈ రాఖీలు ఇంకా తక్కువ ధరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పేరుతో వచ్చే రాఖీలను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

పిల్లలకు, పెద్దలకు, భక్తిగా ఉండే సోదరులకు ఇలా పలు రకాల రాఖీలు ఉన్నాయి. కొంతమంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సోదరులకు గణపతి రాఖీ, శ్రీరామ ధనస్సు రాఖీ, నెమలి పింఛంతో ఉన్న రాఖీ, త్రిశూలం, ఓం వంటి రాఖీలను కట్టచ్చు. మీ అన్నయ్యలు లేదా తమ్ముళ్ల ఛాయిస్ ని బట్టి ఈ రాఖీలను ఎంచుకోవచ్చు. ఈ రాఖీలను కడితే మీరు చాలా స్పెషల్ గా నిలుస్తారు. ఈ రాఖీలను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

పిల్లల కోసం అయితే బొమ్మలతో కూడిన రాఖీలు ఉన్నాయి. ఏనుగు, టెడ్డీ బేర్ డైనోసార్ ఇలా కొన్ని జంతువుల బొమ్మలతో కూడిన రాఖీలు ఉన్నాయి. మీ బుల్లి తమ్ముళ్ల కోసం లేదా అన్నయ్యల కోసం ఈ బొమ్మల రాఖీలు కడితే చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ రాఖీలను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఇక రాఖీల్లో ఫోటోలు కూడా పెట్టుకునేవి ఉన్నాయి. మీ అన్నయ్య, మీరు కలిసి దిగిన ఫోటో లేదా మీ తమ్ముడు, మీరు కలిసి దిగిన ఫోటోని రాఖీలో పెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఆన్ లైన్ లోనే డిజైన్ చేయించుకోవచ్చు. ఇవి 220 రూపాయలు, 250 రూపాయలు, 500 రూపాయలు ఇలా కంపెనీని బట్టి, డిజైన్ ని బట్టి ధరలు ఉన్నాయి. ఆర్డర్ చేసే ముందు కస్టమైజ్ లోకి వెళ్లి ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటోతో ఉన్న రాఖీని మీకు డెలివరీ చేస్తారు. వేరే కంపెనీలు అయితే ఆర్డర్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి ఆర్డర్ ఐడీ, ఫోటో పంపించాలి. అప్పుడు మీకు ఫోటోతో ఉన్న రాఖీ డెలివరీ చేస్తారు. ఈ రాఖీలను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments