Tirupathi Rao
కారు కొనాలి అనీ అందరూ అనుకుంటారు. కానీ, వారికి ఎలాంటి కారు కొనాలి అనే అవగాహన మాత్రం ఉండదు. అలాంటి వారి కోసం బెస్ట్ మైలేజ్ ఇచ్చే బడ్జెట్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.
కారు కొనాలి అనీ అందరూ అనుకుంటారు. కానీ, వారికి ఎలాంటి కారు కొనాలి అనే అవగాహన మాత్రం ఉండదు. అలాంటి వారి కోసం బెస్ట్ మైలేజ్ ఇచ్చే బడ్జెట్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.
Tirupathi Rao
మధ్యతరగతి వాళ్లు కూడా కారు కొనాలి అనుకుంటారు. అయితే వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్లు కారును కొనుగోలు చేయాలి అనుకుంటారు. కారు కొనాలి అనే ఆలోచన రాగానే చాలా మంది.. ఇంటి ముందు కారు తీసుకొచ్చి పెట్టే వరకు నిద్రపోరు. అలాంటి అత్యుత్సాహంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కారు కొనాలి అనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు. ఎలాంటి కారు కొనాలి? మన అవసరం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ని కూడా వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే.. ధర తక్కువుంటే సరిపోదు.. దానికి తగినట్లు కారు మంచి మైలేజ్ కూడా ఇవ్వాలి. అలాగే మెయిన్ట్ నెన్స్ కూడా అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన కారును ఎంచుకుంటే మంచిది. అయితే ఈ విషయంలో చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లో ఉండే.. కొన్ని బెస్ట్ మైలేజ్ కార్ల గురించి తెలుసుకుందాం.
కార్ల గురించి అవగాహన ఉన్న వారికి మారుతీ సుజుకి స్విఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఉండే కార్లలో మీకు ఎక్కువ భాగం ఈ స్విఫ్ట కార్లే కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ లో వీటికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ కార్లు బడ్జెట్ లో ఉండటమే కాకుండా.. బెస్ట్ మైలేజ్ కూడా ఇస్తాయి. ఈ 5 సీటర్ కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 9 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారే కొద్దీ ఈ కారు ధర పెరుగుతూ ఉంటుంది. 1197 సీసీ ఇంజిన్ తో ఈ కారు వస్తోంది. ఇంక ఇందులో మీకు 7 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్యూయల్ లో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్ ఉన్నాయి. మాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలో గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో.. 2 స్టార్స్ దక్కించుకుంది. ఇంక మైలేజ్ చూస్తే.. పెట్రోల్ వర్షన్ లీటరుకు 22.38 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. సీఎన్జీ మోడల్ అయితే 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతోంది.
రెనాల్ట్ కంపెనీలో బాగా క్లిక్ అయిన అతి తక్కువ మోడల్స్ లో కిగర్ కూడా ఒకటి. ఈ కిగర్ కారు మొత్తం 18 వేరియంట్స్, 2 కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ SUV ఎక్స్ షోరూమ్ ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ.11.23 లక్షలు దాకా ఉంది. ఈ 5 సీటర్ కారు 999 సీసీ ఇంజిన్ తో వస్తోంది. సేఫ్టీ విషయంలో ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ ఉంది. పెట్రోల్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. 18 కిలోమీటర్ల నుంచి 19.52 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. సేఫ్టీ, లుక్స్ విషయంలో మాత్రం ఈ కారుకు మంచి మార్కులు పడతాయి.
ఇప్పుడు హ్యూండాయ్ కంపెనీ నుంచి వస్తున్న మోడల్స్ లో వెన్యూ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ కారు అటు ఇటూగా క్రెటాని చూసినట్లే ఉంటుంది. కానీ, బడ్జెట్ లో ఉండే కారనే చెప్పాలి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో మొత్తం 23 వేరియంట్స్, 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5 సీటర్ లో మీరు 998 సీసీ ఇంజిన్ నుంచి 1493 వరకు మీకు నచ్చిన ఇంజిన్ ని ఎంచుకోవచ్చు. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వేరియంట్ మారే కొద్దీ ధర పెరుగుతుంది. గరిష్ఠంగా ఈ కారు టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.48 లక్షలుగా ఉంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ ఇవ్వడానికి అస్సలు ఈ కారుని టెస్ట్ చేయలేదు. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ 17.5 కిలోమీటర్లు, డీజిల్ మోడల్ 23.4 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు.
హ్యాట్చ్ బ్యాక్ మోడల్ లో మీకు బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే కారు అంటే.. మారుతీ సుజుకీ ఇగ్నిస్ కారు అని చెప్పచ్చు. ఈ 5 సీటర్ కారులో మొత్తం 11 వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో 6 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కారు కేవలం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. ఈ 5 సీటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్ ఎండ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.30 లక్షలుగా ఉంది. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ క్యాప్ రేటింగ్ అయితే లేదు. దీనిని టెస్ట్ చేయలేదు. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 20.89 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లలో వీటిని మీరు ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. అయితే కారు కొనే ముందు ఈ బడ్జెట్ ఏంటి? మీ అవసరం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మరి.. ఈ కార్లలో మీకు ఏ కారు నచ్చింది? మీరు ఏ కారు కొనాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.