రోజుకు రూ.100 పొదుపుతో.. కోటీశ్వరుడు అయిపోవచ్చు! ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

రోజుకు రూ.100 పొదుపుతో.. కోటీశ్వరుడు అయిపోవచ్చు! ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

జీవితంలో ఎదగడం కోసం డబ్బు పొదుపు చేసుకోవాలని ఎవరికీ ఉండదు. అందుకే ఎంతోకొంత డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటే.. ఆ డబ్బు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. మరి డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని.. దానికి బెస్ట్ ప్లాన్స్ ఏంటా అని అందరు ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జీవితంలో ఎదగడం కోసం డబ్బు పొదుపు చేసుకోవాలని ఎవరికీ ఉండదు. అందుకే ఎంతోకొంత డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటే.. ఆ డబ్బు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. మరి డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని.. దానికి బెస్ట్ ప్లాన్స్ ఏంటా అని అందరు ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం అందరికి పెట్టుబడులు పెట్టాలని ఉన్నా కూడా.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి అని అందరికి సందేహాలు ఉంటాయి. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది చూసేద్దాం, వీటిలో గ్యారెంటీ రిటర్న్స్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి .. పొదుపు పథకాలు, పోస్టాఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ఉండనే ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్య.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. స్టాక్ మర్కెట్స్ లో రిస్క్ ఎక్కువ ఉన్న కారణంగా .. దానికంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు బెస్ట్ ఆప్షన్ అని అందరు భావిస్తున్నారు. ఇక్కడ కూడా సరైన.. పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే కనుక భారీగానే రిటర్న్స్ అందుకోవచ్చు.. ఇందులో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది, అంటే డబ్బు డబ్బుపై ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు.

ఇక ఈ మ్యూచువల్ ఫండ్స్ లో.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడి బెటర్ అని అందరు భావిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నెల నెల కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇక్కడ ముందుగా ప్రతి నెలా ఎంత డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారనేది నిర్ణయించుకోవాలి. అలా రూ. 100 ఆదా చేయడం ద్వారా కూడా కొన్నేళ్లలో రూ. కోటి ఫండ్ సృష్టించవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు రూ. 100 అంటే.. SIP ద్వారా అది ఒక నెలకు రూ. 3000 పెట్టుబడి అవుతుంది. ఇలా క్రమం తప్పకుండా.. 21 సంవత్సరాల పాటు.. పెట్టుబడి పెడుతూ ఉండాలి. 21 సంవత్సరాలంటే.. సుమారు 250నెలలు.. నెలకు రూ. 3 వేల చొప్పున 250 నెలలకు .. మీ అమౌంట్ రూ. 7.56 లక్షలు మాత్రమే అవుతుంది.

కాగా, మ్యూచువల్ ఫండ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కారణంగా.. అవి దీర్ఘ కాలంలో.. మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో 20% వరకు రాబడిని అందించే ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది.. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ,మంచి ఫండ్ ఎంపిక చేసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు పెట్టె పెట్టుబడికి.. 20 శాతం వార్షిక రాబడి ప్రకారం. 21 సంవత్సరాలలో రూ. 1.16 కోట్లకు చేరుతుందన్నమాట. పెట్టుబడి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే.. రిటర్న్స్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశించవచ్చు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments