Hyundai మోస్ట్ ట్రస్టెడ్ మోడల్.. ఇప్పటికీ క్రేజ్ ఎందుకు తగ్గలేదంటే?

హ్యూండాయ్ కంపెనీలో చాలానే మోడల్స్ ఉన్నాయి. కానీ, కొన్నేళ్లుగా ఈ కారుకి మాత్రం ఆదరణ తగ్గడం లేదు.

హ్యూండాయ్ కంపెనీలో చాలానే మోడల్స్ ఉన్నాయి. కానీ, కొన్నేళ్లుగా ఈ కారుకి మాత్రం ఆదరణ తగ్గడం లేదు.

భారత్ మార్కెట్ లో హ్యూండాయ్ కార్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి చాలానే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో బడ్జెట్, మిడిల్ క్లాస్, ప్రీమియం మోడల్స్ ఉన్నాయి. హ్యూండాయ్ అనగానే అందరికీ వెర్నా కారే గుర్తొస్తుంది. అయితే ఇది కాస్త ప్రీమియం కారనే చెప్పాలి. అందరూ ఎఫర్డ్ చేయలేకపోవచ్చు. కానీ, ఇంకో మోడల్ కూడా ఇప్పటికే మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే ఫీచర్స్ తో ఉంది. అలాగే 2023లో అయితే మరిన్ని అప్ గ్రేడెడ్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. మరి.. ఆ మోడల్ ఏంటి? ఆ ఫీచర్స్ ఏంటి? దాని ధర ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చూద్దాం.

హ్యూండాయ్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న మిడిల్ క్లాస్ స్పెషల్ మోడల్ కారు మరేదో కాదు.. i20. ఈ కారుకు ఇప్పటికే చాలా మంచి రెప్సాన్స్ ఉంది. ఇప్పటికీ ఈ కారును కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడం లేదు. ఈకారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 12 వేరియంట్స్ తో వస్తోంది. ఇందులో ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, ఆస్టా(ఓ) అనే వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే హైఎండ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.16 లక్షలుగా ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే.. 1197 సీసీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 83PS/115NM పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యూండాయ్ ఐ20లో పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ తో వస్తోంది. ఈ కారు ఫీచర్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. డ్యాష్ బోర్డ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. యాపిల్ కార్ ప్లే- ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్స్ తో వస్తోంది. స్టార్ట్, స్టాప్ బటన్, ఎయిర్ ప్యూరిఫయర్ ఉంటాయి. వైర్ లెస్ ఛార్జర్, మినీ ఫ్రీజర్, సెమీ డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, ఆటో ఎల్ ఈడీ హెడ్ లైట్స్, సన్ రూఫ్ కూడా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 16 నుంచి 20 కిలీమీటర్ల వరకు వస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది.

సేఫ్టీ విషయంలో కూడా ఈ హ్యూండాయ్ ఐ20 కారుకు మంచి మార్కులే పడతాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చైల్డ్ సీట్ యాంకరేజ్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల(ESC), హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మ్యానేజ్మెంట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో ఈ హ్యూండాయ్ ఐ20కి 3 స్టార్ రేటింగ్ దక్కింది. అంటే ఇది మీ కుటుంబానికి భద్రత పరంగా సేఫ్ కారనే చెప్పాలి. ఇంక ధర విషయంలో వాల్యూ ఫర్ మనీ అంటూ ఇప్పటికే వాడుతున్న వినియోగదారులు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇలాంటి హ్యూండాయ్ కారు ఇప్పుడు సరికొత్త లుక్స్, కలర్ ఆప్షన్స్ తో వచ్చింది. 2 డ్యూయల్ టోన్ కలర్స్, 6 మోనోటోన్ కలర్ ఆప్షన్స్ తో ఈ హ్యూడాంయ్ ఐ20 వస్తోంది. మరి.. హ్యూండాయ్ ఐ20పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments