కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వ బ్యాంకు.. మరింత పెరగనున్న ఆదాయం!

Bank Of Maharashtra Launched 4 Special Fixed Deposit Scehmes: వరుసపెట్టి ప్రభుత్వ బ్యాంకులు ఖాతాదారులకు శుభవార్తలు చెబుతున్నాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ బ్యాంకులు ప్రత్యేక స్కీంలను ప్రవేశపెట్టగా.. తాజాగా మరో దిగ్గజ ప్రభుత్వ బ్యాంకు కస్టమర్ల కోసం 4 ప్రత్యేక పథకాలను ప్రవేశపెటింది. 

Bank Of Maharashtra Launched 4 Special Fixed Deposit Scehmes: వరుసపెట్టి ప్రభుత్వ బ్యాంకులు ఖాతాదారులకు శుభవార్తలు చెబుతున్నాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ బ్యాంకులు ప్రత్యేక స్కీంలను ప్రవేశపెట్టగా.. తాజాగా మరో దిగ్గజ ప్రభుత్వ బ్యాంకు కస్టమర్ల కోసం 4 ప్రత్యేక పథకాలను ప్రవేశపెటింది. 

ప్రభుత్వ బ్యాంకులు వరుసపెట్టి ఖాతాదారులకు గుడ్ న్యూస్ లు చెబుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్ డిపాజిట్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పగా.. తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. అమృత్ వృష్టి పేరిట ఎస్బీఐ 444 రోజుల కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక ఎస్బీఐ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మాన్సూన్ ధమాకా పేరిట రెండు సెపరేట్ టెన్యూర్స్ తో స్పెషల్ స్కీములని పరిచయం చేసింది. ఇప్పుడు మరో బ్యాంకు నాలుగు ప్రత్యేక పథకాలతో ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాలుగు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ని లాంఛ్ చేసింది. 200 రోజులు, 400 రోజులు, 666 రోజులు, 777 రోజుల టెన్యూర్స్ తో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ని లాంఛ్ చేసింది. సాధారణ ప్రజలకు 200 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ ఇస్తుండగా.. 400 రోజుల డిపాజిట్ పై 7.10 శాతం వడ్డీ ఇస్తుంది. 666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.15 శాతం వడ్డీ ఇస్తుండగా.. 777 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.25 శాతం వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్స్ కి అయితే 50 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ వస్తుందని మహారాష్ట్ర బ్యాంకు తెలిపింది.

ఇక ఎస్బీఐ బ్యాంకు ఇప్పటికే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ అమృత్ కలశ్ పై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్స్ కి 7.60 శాతం వడ్డీ ఇస్తుంది. తాజాగా అమృత్ వృష్టి పథకంతో 444 రోజుల కాలపరిమితి మీద సాధారణ సిటిజన్స్ కి 7.25 శాతం, సీనియర్ సిటిజన్స్ కి 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 333 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ మీద సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్స్ కి మాత్రం ఏకంగా 7.65 శాతం వడ్డీ ఇస్తుంది. 399 రోజుల ఎఫ్డీపై సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్స్ కి ఏకంగా 7.75 శాతం వడ్డీ అందజేస్తుంది.

Show comments