iDreamPost

ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? 1,500 మంది టెక్ ఉద్యోగులను తీసుకోనున్న ప్రభుత్వ Bank

టెకీలకు తీపి కబురు అందించిన ప్రభుత్వ బ్యాంక్. 1500 మంది టెక్ ఉద్యోగులను తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఐటీ టీమ్ ను బలోపేతం చేసుకునేందుకు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.

టెకీలకు తీపి కబురు అందించిన ప్రభుత్వ బ్యాంక్. 1500 మంది టెక్ ఉద్యోగులను తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఐటీ టీమ్ ను బలోపేతం చేసుకునేందుకు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? 1,500 మంది టెక్ ఉద్యోగులను తీసుకోనున్న ప్రభుత్వ Bank

వరల్డ్ వైడ్ గా ఐటీరంగంలో ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు లక్షమంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారాయి. ఏ క్షణం జాబ్ పోతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఐటీ ఉద్యోగులు. మరోవైపు కొత్త నియామకాలు లేక టెకీలు తీవ్ర నిరాశలో పడిపోయారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ టెక్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఏకంగా 1500 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది.

కస్టమర్లకు బ్యాంక్ సేవలు మరింత చేరువ చేసేందుకు, సేవలను సులభతరం చేసేందుకు టెక్నాలీజీని విరివిగా వినియోగిస్తున్నాయి బ్యాంకులు. టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తుండడంతో బ్యాంకుల్లో టెక్ ఉద్యోగులకు అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా టెకీలకు తీపికబురును అందించింది. భారీగా టెక్ సిబ్బందిని నియమించుకునేందుకు రెడీ అవుతుంది. ఏకంగా 1500 మంది టెకీలకు ఉద్యోగాలను కల్పించనున్నది. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇప్పుడున్న(1500) ఉద్యోగుల సంఖ్యను రెట్టిపు(3000) చేయనున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్‌ తెలిపారు.

కాగా పలు బ్యాంక్ లలో తరచూ టెక్నికల్ సమస్యలు తలెత్తుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఆంక్షలు ఇటీవల బీవోబీపై విధించింది. ఈ నేపథ్యంలో ఐటీ టీమ్ ను మరింత సమర్ధవంతం చేసేందుకు బీవోబీ సిద్ధమవుతున్నది. రెగ్యులర్‌ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు బ్యాంక్ సీఈవో తెలిపారు. త్వరలో కస్టమర్ల కోసం జనరేటివ్ ఏఐతో పనిచేసే ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా కస్టమర్లకు పలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ చర్యలతో కస్టమర్లుకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ఇక ఇటీవలి కాలంలో ఆర్బీఐ నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి