బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌.. వీటిలో ఏది బెటర్ అంటే?

Bajaj Chetak Vs TVS iQube: బజాజ్‌ చేతక్‌ , టీవీఎస్‌ ఐక్యూబ్‌.. రెండు కూడా మంచి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇండియాలో పాపులర్ స్కూటర్లుగా కొనసాగుతున్నాయి.

Bajaj Chetak Vs TVS iQube: బజాజ్‌ చేతక్‌ , టీవీఎస్‌ ఐక్యూబ్‌.. రెండు కూడా మంచి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇండియాలో పాపులర్ స్కూటర్లుగా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో టీవీఎస్ మోటార్, బజాజ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.. ఈ కంపెనీల నుంచి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్లనేవి వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఐక్యూబ్ ధర రూ .1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. బజాజ్ చేతక్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 95 వేల నుంచి ప్రారంభమవుతాయి 1980, 90 లలో బజాజ్ చేతక్ చాలా ఫేమస్ స్కూటర్ గా కొనసాగేది. మధ్యతరగతి ప్రజలు దీనిని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఆ తరువాత డిస్కంటిన్యూ అయిపోయింది. అయితే మళ్ళీ 2020లో బజాజ్ కంపెనీ చేతక్ స్కూటర్ ని ఎలక్ట్రిక్ వర్షన్లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ కూడా 2020లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ ఐక్యూబ్ 3 బ్యాటరీ ఆప్షన్లలో ఉంది. బజాజ్ చేతక్‌ కేవలం ఒకే ఒక్క బ్యాటరీ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఐక్యూబ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ఇస్తుంది. బజాజ్ చేతక్ బైక్ అయితే 126 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లుకి హోమ్ ఛార్జింగ్ ఫీచర్ అనేది ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్‌ 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ TFT స్క్రీన్‌ తో వస్తుంది. ఈ స్కూటర్లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మొబైల్ ఫోన్ కాల్స్, SMS, సోషల్ మీడియా నోటిఫికేషన్లు, డాక్యూమెంట్‌ స్టోరేజ్, మ్యూజిక్ కంట్రోల్, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్స్, క్లస్టర్‌ థీమ్స్‌ ఇలా ఎన్నో సూపర్ స్మార్ట్ ఫీచర్లను ఉంటాయి.బజాజ్ చేతక్‌ విషయానికి వస్తే.. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆన్ బోర్డ్ మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. చేతక్ TACPAC వంటి సూపర్ ఫీచర్‌ని కూడా అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ కావాలంటే మాత్రం మీరు ఎక్కువ డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్ ఇంకా రివర్స్ మోడ్స్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇక బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు స్కూటర్లకు కూడా అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఐక్యూబ్‌లో BLDC మోటార్‌ అనేది ఉంటుంది. దీన్ని స్కూటర్ బ్యాక్ వీల్ పైన ఫిక్స్ చేశారు. ఇక బజాజ్‌ చేతక్‌ టెయిల్‌లైట్‌తో ఉంటుంది. అందువల్ల దీని వెనక భాగం పొడవుగా ఉంటుంది. రెండు స్కూటర్లు కూడా వేటికవే ప్రత్యేకం. రెండు కూడా మంచి ఫీచర్లు కలిగి ఉన్నాయి. పైగా రెండు కంపెనీలు కూడా ఇండియాలో పాపులర్ కంపనీలుగా దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. వింటేజ్ లుక్స్ ఇష్టపడేవారు చేతక్ తీసుకుంటే బాగుంటుంది. లేటెస్ట్ లుక్స్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలనుకునేవారికి ఐక్యూబ్ బెస్ట్ ఆప్షన్. ఇక ఈ రెండింటి గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments