నిరుద్యోగులకు Ather Energy గుడ్ న్యూస్.. ఏకంగా 4000 ఉద్యోగాలు!

Ather Energy New Plant In Maharashtra: ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలో ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు అతి పెద్ద అడుగు పడుతోంది. 2 వేల కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ ని స్థాపించబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏకంగా 4000 మందికి ఉపాధి లభించనుంది.

Ather Energy New Plant In Maharashtra: ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలో ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు అతి పెద్ద అడుగు పడుతోంది. 2 వేల కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ ని స్థాపించబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏకంగా 4000 మందికి ఉపాధి లభించనుంది.

ఇండియా అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా టూ వీలర్ అయితే ఎలక్ట్రిక్ తీసుకొనేందుకు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏథర్ ఎనర్జీస్ కంపెనీకి డిమాండ్ పెరిగింది. సాధ్యమైనంత తక్కువ ధరలో.. మంచి బిల్ట్ క్వాలిటీతో వీళ్లు వాహనాలను అందిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో ఏథర్ ఈవీలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఏథర్ కంపెనీ సరైన నిర్ణయం తీసుకుంది. తమ కొత్త ప్లాంట్ ఏర్పాటు పనుల్లో నిమగ్నమైంది. ఏకంగా రూ.2 వేల కోట్లతో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పోందుకు అడుగులు వేస్తోంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఏకంగా 4000 వేల మందికి ఉపాధి లభించనుంది.

ఏథర్ ఎనర్జీ తమ కొత్త తయారీ ప్లాంట్ ను స్థాపించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం ఏకంగా రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తమ ప్లాంట్ ను మహారాష్ట్రలో స్థాపించేందుకు కంపెనీ నిర్ణయించింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ ప్లాంట్ ని ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్లాంట్ కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. వీళ్లు ఇక్కడ కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే కాకుండా.. బ్యాటరీలను కూడా తయారు చేయనున్నారు.

ఈ విషయాన్ని ఏథర్ కంపెనీ నిర్ధారించింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఏకంగా 4000 మందికి ఉపాధి కలిగించేందుకు ఆస్కారం ఉంటుందని ప్రకటించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా నిలుస్తుందని ఆయన తన పోస్టులో వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏథర్ ఎనర్జీ ఏటా 10 లక్షల కంటే ఎక్కువ వాహనాలను, బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు. ఏథర్ ఎనర్జీకి తమిళనాడులోని రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే అవి ఒకటి బ్యాటరీలను ఉత్పత్తి చేసే కేంద్రం. మరొకటి అసెంబ్లింగ్ యూనిట్. వీటి ద్వారా ఏథర్ కంపెనీ ఏటా రూ.4.3 లక్షల బ్యాటరీ ప్యాక్ లు తయారు చేస్తుంది. అలాగే 4.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.

మహారాష్ట్రలో స్థాపిస్తున్న కొత్త ప్లాంట్ అందుబాటులోకి వస్తే.. ఏథర్ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే బుక్ చేసుకున్న వారికి వాహనాలను త్వరగా డెలివరీ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. సప్లయ్ పెరగడం వల్ల ఏథర్ ఈవీల ధరలు కూడా తగ్గే ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాహనదారులను ఏథర్ ఈవీలను అందించే సమయం చాలా తగ్గుతుందని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్, సీటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు. ఏథర్ కంపెనీ ఈవీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ఇది అతి పెద్ద అడుగు అని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. ఏథర్ ఎనర్జీ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments