Dharani
Anant Ambani Radhika Wedding-Reliance Employees Gifts: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ముఖేష్ రిలయన్స్ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు పంపాడు. ఆ వివరాలు..
Anant Ambani Radhika Wedding-Reliance Employees Gifts: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ముఖేష్ రిలయన్స్ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు పంపాడు. ఆ వివరాలు..
Dharani
ఇండియా కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట ఎంత చిన్న శుభకార్యం అయినా సరే.. ఓ రేంజ్‌లో చేస్తారు. ఇక అదే పెళ్లి లాంటి వేడుక అయితే.. ఇక ఆ వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల కోట్లు ఖర్చు చేసి.. భూమి ఆకాశాలను ఏకం చేసి.. దేశవిదేశాల నుంచి అతిథులను రప్పించి.. అంగరంగ వైభవంగా వేడుక నిర్వహిస్తారు. సుమారు నెల రోజుల పాటు దేశమంతా ఈ వేడుక గురించే మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా మరోసారి ఇదే దృశ్యం ఆవిష్కృతమవుతోంది. నేడు శుక్రవారం అనగా జూలై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జరగనుంది.
ఈ వేడుకలో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు తరలి వచ్చారు. వీరి కోసం ముంబైలోని స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేశాడు ముఖేష్ అంబానీ. అంతేకాక అతిథులను వివాహ వేదిక వద్దకు తరలించేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్ విమానాలను అందుబాటులో ఉంచింది అంబానీ కుటుంబం. పెళ్లి కోసం అంబానీలు చేస్తున్న ప్రతి వేడుక ఆసక్తికరంగా నిలుస్తోంది. ఈ క్రమంలో కుమారుడి పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వివాహ బహుమతులు పంపించారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం వేళ.. రిలయన్స్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీ తమకు పంపిన వెడ్డింగ్ గిఫ్ట్స్కు సంబంధించిన ఫోటోలను పలువురు ఉద్యోగుల సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గిఫ్ట్‌లో అందులో ఏమున్నాయంటే.. ఎరుపు రంగు బాక్సు పై బంగారు వర్ణంలో వధూవరుల పేర్లు కనిపిస్తున్నాయి. బాక్సు లోపల నాలుగు రకాల మిఠాయిలు, తినుబండారాలు ఉన్నాయి. ఆలూ భుజియా, సేవ్, చిడ్వాతో పాటు వెండి నాణాన్ని సైతం అందించారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా పలు సందర్భాల్లో ముందస్తు వేడుకలు నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. వీటిల్లో భాగంగా జులై 2వ తేదీన 50 జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది అంబానీ కుటుంబం. ఈ సందర్భంగా నూతన వధూవరులకు.. లక్ష రూపాయల చెక్, ఏడాదికి సరపడా సరుకులు అందించి ఆశీర్వదించింది. అలాగే ముంబైలోని స్వగృహం ఆంటిలియాలో అన్నదాన కార్యక్రమం చేపట్టింది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో నిర్వహించిన ముందస్తు పెళ్లి వేడుకల్లో అక్కడి గ్రామల ప్రజలకు సైతం అన్నదాన కార్యక్రమం నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్నారు. వీటిల్లో అనేక కంపెనీల సీఈఓలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.