Amazon Not Accepting Rs 2000 Notes: అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ నోట్లు చెల్లవు.. కారణమిదే

అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ నోట్లు చెల్లవు.. కారణమిదే

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. మే 19, 2023న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2000 నోట్లను చెలామణి నుంచి తొలగించింది. అలాగే ఈ నోట్లను మార్చుకోవడానికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మరో 15 రోజుల్లో అది ముగియనుంది. ఆర్బీఐ ప్రకటన వెలువడిన నాటి నుంచి చాలా మంది తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళ్లారు. సెప్టెంబర్‌ 30, 2023 వరకు మాత్రమే రూ. 2000 నోటు చట్టబద్ధంగా ఉంటుంది. తీసివేయబడుతుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

క్యాష్‌ ఆన్‌ డెలివరీ సందర్భంగా 2 వేల రూపాయల నోటును స్వీకరించబోము అని అమెజాన్‌ తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి రూ.2 వేల నోట్లను నగదుగా స్వీకరించబోమని వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) చెల్లింపులు, క్యాష్‌లోడ్ కోసం సెప్టెంబర్ 19 నుంచి రూ.2,000 నోట్లను నగదుగా స్వీకరించబోమని దిగ్గజ​ ఈకామర్స్‌ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్లను స్వీకరిస్తున్నట్లు అమెజాన్ తను వెల్లడించిన నోట్‌లో పేర్కొంది. అయితే సెప్టెంబర్‌ 19, 2023 నుంచి ఈ నోట్లను తీసుకోలేమని తెలిపింది. థర్డ్ పార్టీ కొరియర్ భాగస్వామి ద్వారా ప్రోడక్ట్‌ను డెలివరీ చేస్తే రూ.2000 నోటు ఆమోదించబడుతుందని అమెజాన్ చెప్పుకొచ్చింది.

Show comments