Alto K10 న్యూ రికార్డ్.. రెండు దశాబ్దాల నుంచి టాప్! ఎందుకు దీనికంత క్రేజ్?

Maruthi Alto K10: మారుతి సుజికి ఆల్టో K10 క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ కార్ సూపర్ రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డుల్లో నిలిచింది.

Maruthi Alto K10: మారుతి సుజికి ఆల్టో K10 క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ కార్ సూపర్ రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డుల్లో నిలిచింది.

మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా కూడా మారుతి సుజికి ఆల్టో K10 క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ కార్ సూపర్ రికార్డ్ సృష్టించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డుల్లో నిలిచింది. 2000 సంవత్సరం నుండి అంటే 24 సంవత్సరాలలో ఏకంగా 50 లక్షలకుపైగా ఆల్టో యూనిట్లు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి నెలా 10 వేల మందికి పైగా వినియోగదారులు దీనిని కొనుగోలు చేస్తున్నారంటే దీని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కార్ ఎప్పుడు డౌన్ అవకుండా మంచి అమ్మకాలని నమోదు చేస్తుందంటే మామూలు విషయం కాదు. ఇక దీన్ని జనాలు ఎందుకు అంతలా ఆదరిస్తున్నారు? దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దీని ధర ఎంత? ఫీచర్లు ఏంటి? వంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మారుతీ ఆల్టో K10 ఇంతలా సేల్ అవ్వడానికి కారణం. దీని ధర. ఆల్టో దేశంలో అత్యంత చవకైన కారు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర కేవలం రూ.3.99లక్షలు. ఇది ఇంతలా ఆకట్టుకోడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదే దీని మైలేజ్. ఇది ఆటోమేటిక్ వేరియంట్ ఏకంగా 24.90 km/l మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్ ఏకంగా 24.39 km/l మైలేజీని ఇస్తుంది.ఇక CNG వేరియంట్ మైలేజ్ అయితే ఏకంగా 33.85 కిలోమీటర్లు ఇస్తుంది. ఇంకోటి మారుతీ కంపెనీ సర్వీస్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా దీని సేల్స్ కి ప్రధాన కారణం. దీని మైంటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే మధ్యతరగతి జనాలు ఈ కారుని ఎగబడి మరీ కొంటున్నారు.

మారుతీ ఆల్టో K10 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంటుంది. ఈ కారు ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌ను పొందుతుంది. ఈ కారులో సురక్షితమైన పార్కింగ్ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అలాగే స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్ వంటి అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఈ కార్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ USB, బ్లూటూత్ ఇంకా ఆక్స్ కేబుల్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని స్టీరింగ్ వీల్‌ని కూడా కొత్తగా డిజైన్‌ చేశారు. ఈ కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్ స్టీరింగ్‌పైనే ఉంటాయి. ఇందులో 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కార్ కొత్త-జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్ మరియు డ్యూయల్ VVT ఇంజన్‌ను కలిగి ఉంది. ఇక మారుతీ ఆల్టో K10 కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments