iDreamPost

ఒకే ఒక్క ప్లాన్ తో OTT, TV ఛానల్స్, ఇంటర్నెట్.. ధర వెయ్యి లోపే

బ్రాండ్ బ్యాండ్ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసేందుకు ఎయిర్ టెల్ కొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చింది. భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ లో వెయ్యిలోపు అదిరిపోయే ప్లాన్స్ అందిస్తోంది.

బ్రాండ్ బ్యాండ్ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసేందుకు ఎయిర్ టెల్ కొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చింది. భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ లో వెయ్యిలోపు అదిరిపోయే ప్లాన్స్ అందిస్తోంది.

ఒకే ఒక్క ప్లాన్ తో OTT, TV ఛానల్స్, ఇంటర్నెట్.. ధర వెయ్యి లోపే

ఇటీవల టెలికాం కంపెనీలు కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్ లను తీసుకొస్తున్నాయి. మార్కెట్ లో తమ సత్తాచాటేందుకు టెలికాం కంపెనీలు పోటీపడిమరి యూజర్ల కోసం తక్కువ ధరతో కూడిన ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండడంతో అతి తక్కువ ధరకే సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ తమ యూజర్ల కోసం కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. కేవలం వెయ్యి రూపాయలలోపే ఓటీటీ, డీటీహెచ్, 3.3టీబీ డెటాతో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను అందిస్తోంది. బ్రాండ్ బ్యాండ్ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసేందుకు ఎయిర్ టెల్ ఈ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.

భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని మరింత విస్తరించేందుకు ఎయిర్ టెల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. మరోవైపు లోకల్ కేబుల్‌ ఆపరేటర్లతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంటోంది. ఈ క్రమంలో ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో రూ.1,000లోపు సూపర్ ప్లాన్స్ ను అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ అందిస్తున్న తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.499. దీంట్లో 40 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్‌ మ్యూజిక్‌, అపోలో 24/7 అదనపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. రూ.1000లోపున్న మరో ప్లాన్‌ రూ.699. దీంట్లోనూ 40 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను పొందొచ్చు. హెచ్‌డీతో కలిపి 350కి పైగా టీవీ ఛానళ్లను చూడొచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్ సహా 20కి పైగా ఓటీటీలను వీక్షించొచ్చు. ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో మరో ప్లాన్ రూ.799. ఇందులో ఇంటర్నెట్‌ స్పీడు 100 ఎంబీపీఎస్. నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్ మ్యూజిక్‌, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ అదనపు ప్రయోజనాలు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కావాలంటే రూ.899 ప్లాన్‌ను పరిశీలించొచ్చు. దీంట్లో డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సహా 20కి పైగా ఓటీటీలు ఉంటాయి. డీటీహెచ్‌లో భాగంగా హెచ్‌డీతో కలిపి 350కి పైగా ఛానళ్లను వీక్షించొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి