iDreamPost
android-app
ios-app

హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై 40 వేల తగ్గింపు..! సింగిల్ ఛార్జ్ తో 165KM రేంజ్

  • Published Aug 10, 2024 | 11:05 AM Updated Updated Aug 10, 2024 | 11:05 AM

Hero Vida V1: కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ఇదే మంచి ఛాన్స్. హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ వెహికిల్ పై రూ. 40 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Hero Vida V1: కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ఇదే మంచి ఛాన్స్. హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ వెహికిల్ పై రూ. 40 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై 40 వేల తగ్గింపు..! సింగిల్ ఛార్జ్ తో 165KM రేంజ్

ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్ లోకి వచ్చిన కొత్తలో ఆదరణ అంతంతమాత్రమే ఉండేది. కానీ కొంత కాలం తర్వాత అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. బడ్జెట్ ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈవీలు అందుబాటులోకి రావడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా న్యూ ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ ఈవీ కోసం చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్. హీరో తమ కంపెనీకి చెందిన విడా వీ1 మోడళ్లపై రూ. 40 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదేమో.. ఇప్పుడే కొనుగోలు చేయండి.

హీరో కంపెనీకి చెందిన టూవీలర్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ, మైలేజీ, ధరల పరంగా అందరికీ అందుబాటులో ఉంటుండడంతో ఈ కంపెనీ చెందిన వాహనాలు సేల్స్ లో దూసుకెళ్తుంటాయి. హీరో కంపెనీ తమ సేల్స్ ను పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించేందుకు అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 మోడళ్లపై ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపు కల్పిస్తోంది. విడా వీ1 ప్లస్, విడా వీ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. డబ్బు ఆదా చేసుకోవాలనుకునే వారు ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనుగోలు చేస్తే బెటర్ అంటున్నారు మార్కెట్ నిపుణులు.

EV Scooter

విడా వీ1 ప్లస్, విడా వీ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. అంటే ఛార్జింగ్ కోసం బ్యాటరీని తీసి వేరే బ్యాటరీ మార్చుకోవచ్చు. ఈ స్కూటర్లలో బేస్ట్ ఫీచర్లు ఉన్నాయి. విడా వీ1 ప్లస్ 3.44 కిలో వాట్ హవర్ బ్యాటరీతో వస్తుండగా విడా వీ1 ప్రో 3.94 కిలోవాట్ హవర్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ తో 165 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. కేవలం 3.4 సెకండ్లలోనే పికప్ అందుకుంటుంది. గంటకు 80కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. హీరో విడా వీ1 ప్లస్ ధర రూ. 1.02 లక్షలుగా ( ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర) ఉంది. విడా వీ1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర) గా ఉంది. ఈ నెలలో ఈ రెండు స్కూటర్లలో ఏదైనా కొనుగోలు చేసినట్లయితే రూ. 40 వేల వరకు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో నేరుగా రూ. 10 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.