iDreamPost
android-app
ios-app

EVపై 37 వేలు తగ్గింపు.. 180 కి.మీల రేంజ్- అదిరిపోయే ఫీచర్లు!

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓ ఈవీ బైక్ పై ఏకంగా రూ. 37 వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓ ఈవీ బైక్ పై ఏకంగా రూ. 37 వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

EVపై 37 వేలు తగ్గింపు.. 180 కి.మీల రేంజ్- అదిరిపోయే ఫీచర్లు!

ఒకప్పుడు దాదాపు అందరిళ్లలో సైకిల్స్ దర్శనమిస్తుండేది. నేడు ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి. సామాన్యులు, పేదలు అనే తేడా లేకుండా నేడు బైక్ లను వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు పెట్రోల్ తో నడిచే బైక్ లు మాత్రమే ఉండేవి. టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రిక్ బైక్ లు అందుబాటులోకి వచ్చాయి. పెట్రోల్ ధరలు పెరగడం, ఇదే సమయంలో ఈవీల ధరలు కూడా పెట్రోల్ తో నడిచే బైక్ ల ధరల్లోనే ఉండడంతో ఈ బైక్ లను కొనేందుకు వాహనదారులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల ఈవీ బైక్ లు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. టార్క్ మోటార్ కంపెనీకి చెందిన క్రటోస్ ఆర్ ఈవీపై క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 37 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

పూణెకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టోర్క్ మోటార్ గతేడాది క్రటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్టన్నింగ్ లుక్, లేటెస్ట్ ఫీచర్లు ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. టార్క్ కంపెనీ ఈ ఈవీపై బంపరాఫర్ ను ప్రకటించింది. మార్చి 31 వరకు క్రటోస్ ఆర్ బైక్‌పై 37 వేల తగ్గింపు పొందవచ్చు. ఇది వరకు ఈ బైక్ పై రూ. 22 వేలు డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్లను ఆకర్శించేందుకు ఇప్పుడు టార్క్ మోటార్ క్రటోస్ ఆర్ బైక్ పై రూ. 15 వేలు తగ్గించింది. ఈ రెండు కలపి ఈ బైక్ పై రూ. 37 వేలు తగ్గింపు పొందొచ్చు. ప్రస్తుతం క్రటోస్ ఆర్ ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1,49,999గా ఉంది. గతంలో ఈ ప్రైస్ 1.87,499 లుగా ఉండేది. ఎక్స్ షోరూం ధరలో ఫేమ్ 2 సబ్సిడీ కల్పిస్తోంది. ఫేమ్ 2 పథకం మార్చి 31న ముగియనుండడంతో అప్పటి వరకు ఈ ఆఫర్ ను పొందే అవకాశం కల్పిస్తోంది.

క్రటస్ ఆర్ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ఐడీసీ రేంజ్ 180 కి. మీలుగా ఉంది. రైడ్ మోడ్‌లో సింగిల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ఇది ఎకో మోడ్‌లో 120 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 105 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. నాలుగు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవుతుంది. టార్క్ క్రటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఐపీ67 రేటింగ్ కలిగిన 4 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఈవీ సిటీ, సిటీ+, స్పోర్ట్స్, రివర్స్ మోడ్‌లను కూడా అందిస్తుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, మొబైల్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్, ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, ఓటీఏ అప్‌డేట్‌లు ఈ బైక్‌లో పొందుపరిచారు.