iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో రూ.16 లక్షలకే 2 BHK ఫ్లాట్! ఎక్కడో తెలుసా?

  • Published May 09, 2024 | 4:51 PM Updated Updated May 09, 2024 | 4:51 PM

గత కథనంలో వెస్ట్, నార్త్ హైదరాబాద్ జోన్స్ లో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనే వివరాలు ఇచ్చాము. ఇవాళ్టి కథనంలో ఈస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం.

గత కథనంలో వెస్ట్, నార్త్ హైదరాబాద్ జోన్స్ లో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనే వివరాలు ఇచ్చాము. ఇవాళ్టి కథనంలో ఈస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో రూ.16 లక్షలకే 2 BHK ఫ్లాట్! ఎక్కడో తెలుసా?

ఈస్ట్ హైదరాబాద్ లో వనస్థలిపురం, బోడుప్పల్, కొత్తపేట, హయత్ నగర్, నాగోల్, ఉప్పల్, పీర్జాదిగూడ, మలక్ పేట, హస్తినాపురం, ఎల్బీ నగర్ ఏరియాల్లో ఫ్లాట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు రూ. 4,400 నుంచి రూ. 6,350 రేంజ్ లో ఉంది. అంటే 2 బీహెచ్కే ఫ్లాట్ అంటే 1000 చదరపు అడుగులకు రూ. 44 లక్షల నుంచి 63 లక్షల వరకూ పలుకుతుంది. ఇక ఈస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు తక్కువగా ఉన్న ఏరియాల విషయానికొస్తే.. ఘట్కేసర్, పోచారం, ఏరియాలు ఉన్నాయి. పోచారంలో చదరపు అడుగు రూ. 4,200 అంటే 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కి 42 లక్షలు పడుతుంది. ఇంకా తక్కువ రేటుకి ఘట్కేసర్ లో అందుబాటులో ఉన్నాయి. ఘట్కేసర్ లో ఫ్లాట్ కొనాలంటే ఒక చదరపు అడుగుకి అత్యధికంగా 98,901 వేలు పలుకుతుంది. సగటు ధర మాత్రం చదరపు అడుగుకి రూ. 5,780 పడుతుంది. అయితే ఈ ఏరియాలో జరిగిన యావరేజ్ ట్రాన్సాక్షన్ రేటు రూ. 2,884గా ఉంది.

ఈ ఘట్కేసర్ లో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి ప్రారంభ ధర రూ. 1666 పడుతుంది. అంటే 2 బీహెచ్కే ఫ్లాట్ కి అంటే 1000 చదరపు అడుగులకు 16 లక్షల 66 వేలు అవుతుంది. ఈ రేట్లు సొసైటీల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా ఇవ్వబడింది. అది కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగా ఇవ్వబడింది. తెలంగాణ ప్రభుత్వం లెక్కలు ప్రకారం.. జూలై 2023లో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ రేటు 22 లక్షలకు ఒక వ్యక్తి బిల్డర్ నుంచి కొనడం జరిగింది. చదరపు అడుగు రూ. 2,200 పడింది. నాల్గవ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కొన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో చదరపు అడుగు 3,800 పెట్టి 1722 చదరపు అడుగుల ఫ్లాట్ ని 65 లక్షల 43  వేలకు కొనుగోలు చేశారో వ్యక్తి. ఇది 5వ ఫ్లోర్ లో ఉంది. ఘట్కేసర్ లో 16 లక్షలు నుంచి 30 లక్షల రేంజ్ లో కూడా దొరుకుతున్నాయి.    

ఈస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ ధరలు ఎక్కువగా ఉన్న  ఏరియాలు:

  • వనస్థలిపురం: రూ. 4,450 నుంచి రూ. 5,350/- 
  • బోడుప్పల్: రూ. 4,600/-
  • కొత్తపేట: రూ. 4,800/-
  • హయత్ నగర్: రూ. 4,850/-
  • నాగోల్: రూ. 5,500/-
  • ఉప్పల్: 5,500/-
  • పీర్జాదిగూడ: రూ. 5,650/-
  • మలక్ పేట: రూ. 5,900/-
  • హస్తినాపురం: రూ. 5,950/-
  • ఎల్బీ నగర్: రూ. 6,350/-

ఈస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ ధరలు తక్కువగా ఉన్న  ఏరియాలు:

  • ఘట్కేసర్: రూ. 1966 నుంచి రూ. 2,884 వరకూ
  • పోచారం రూ. 4,200/-

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.