iDreamPost
android-app
ios-app

అట్టహాసంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంఛింగ్.. తొలిరోజు హైలెట్స్ ఇవే!

Bigg Boss Telugu Season 8 Grand Launch Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ ని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకు గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ ని ఉదాహరణగా చెప్పచ్చు. మరి.. గ్రాండ్ లాంఛ్ ఈవెంట్లో హెలెట్స్ ఏంటో చూద్దాం.

Bigg Boss Telugu Season 8 Grand Launch Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ ని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకు గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ ని ఉదాహరణగా చెప్పచ్చు. మరి.. గ్రాండ్ లాంఛ్ ఈవెంట్లో హెలెట్స్ ఏంటో చూద్దాం.

అట్టహాసంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంఛింగ్.. తొలిరోజు హైలెట్స్ ఇవే!

ఈసారి హౌస్ ని జంగిల్ థీమ్ తో రన్ చేస్తున్నారు. అంటే ప్రతి రూమ్ కి.. ప్రతి ఏరియాకి ఒక జంతువు థీమ్ ని ఆపాదిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఉండే అన్నీ సదుపాయాలు, రూమ్స్ ఉన్నాయి. వాటికి ఈసారి అదనంగా ఒక యాక్షన్ రూమ్ అని పెట్టారు. దానికి పీకాక్ బెడ్ రూమ్ లో నుంచి నేరుగా యాక్సెస్ ఇచ్చారు. గతంలో యాక్టివిటీ ఏరియా అన్నారు కదా.. ఇప్పుడు యాక్షన్ రూమ్ అన్నారు. అలాగే ఈసారి చెప్పుకోవాల్సిన విషయాల్లో బెడ్ రూమ్స్ కూడా ఒకటి ఈసారి మూడు రకాల బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఈసారి బెడ్ రూమ్స్ లో పవర్స్ ఉంటాయి. మొదటిది తూనీగ బెడ్ రూమ్. తూనీగ అంటే అదృష్టానికి గుర్తు. కష్టంతోపాటు అదృష్టం ఉంటేనే ఈ బెడ్ రూమ్ లోకి వెళ్తారు. రెండోది పీకాక్ బెడ్ రూమ్.. ఆడే స్ట్రెంథ్- పవర్ ఉంటేనే.. ఈ బెడ్ రూమ్ లోకి వెళ్తారు. ఆఖరిది జీబ్రా బెడ్ రూమ్.. ఎవరికీ లొంగకుండా.. మాట పొగరుకి భయపడకుండా ఉండేవాళ్లు ఈ బెడ్ రూమ్ లోకి వస్తారు.

జంటలుగా హౌస్ లోకి:

ఈసారి అందరినీ జంటలు జంటలుగా హౌస్ లోకి పంపారు. ఈసారి ఈ జంటల కాన్సెప్ట్ కాస్త కొత్తగానే ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన జంటలు వరుసగా.. 1. యష్మీ గౌడ- నిఖిల్ మలియక్కల్, 2. అభయ్ నవీన్- ప్రేరణ కంభం, 3. ఆదిత్య ఓం- సోనియా, 4. మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క- ఆర్జే శేఖర్ బాషా, 5. కిరాక్ సీత- నాగ మణికంఠ, 6. పృథ్వీరాజ్- విష్ణు ప్రియ, 7. నైనికా- యూట్యూబర్ నబీల్ అఫ్రీదీ. ఈ ఏడు జంటలు హౌస్ లోకి వెళ్లాయి. అందరూ కూడా డిఫరెంట్ మైండ్ సెట్, స్ట్రెంథ్స్ కలిగిన వాళ్లను పెయిర్ గా చేసినట్లు అనిపిస్తోంది.

గెస్టులు:

ఈసారి గ్రాండ్ లాంఛ్ కి కూడా గెస్టులు వచ్చారు. మొదట రానా- నివేదా థామస్ హౌస్ లోకి వెళ్లారు. వీళ్లు తమ 35 చిన్న కథ కాదు.. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. రానా- నివజా థామస్ హౌస్ లోకి వెళ్లి వారితో టాస్క్ కూడా ఆడింయారు. అలాగే సీజన్ మొత్తానికి కెప్టెన్ ఉండడు అనే విషయాన్ని రివీల్ చేసి వచ్చారు. ఆ తర్వాత గెస్టులుగా న్యాచురల్ స్టార్ నాని- హీరోయిన్ ప్రియాంక మోహన్ హౌస్ లోకి వెళ్లారు. వీళ్లు కూడా హౌస్ లోని జంటలతో ఒక టాస్కు ఆడించి వచ్చారు. అలాగే హౌస్ లో ఈసారి రేషన్ ఉండదు అనే బ్యాడ్ న్యూస్ అప్పజెప్పి వచ్చారు. లాస్ట్ గెస్టుగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడ్ వచ్చాడు. హౌస్ లోకి వెళ్లి నాగ మణికంఠను బయటకు తీసుకెళ్తున్నాను అని ఓట్లు కూడా వేయించాడు. ఈ దెబ్బతో హౌస్ లో కుంపటి రాజేసి వచ్చాడు.

big boss 8 highlits

3 బ్యాడ్ న్యూసులు:

ఈసారి హౌస్ లో ఏదున్నా కూడా 3 ఆప్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే హౌస్ లో తొలిరోజు 3 బ్యాడ్ న్యూసులు చెప్పారు. అందులో మొదటిది ఇంటికి సీజన్ మొత్తం కెప్టెన్ ఉండడు. కెప్టెన్ లేడు అంటే.. వాళ్లకు ఇమ్యునిటీ కూడా ఉండదు అని అర్థం. అంటే ప్రతి ఒక్కరు సీజన్ మొత్తం పోరాడాల్సిందే. రెండో బ్యాడ్ న్యూస్ రేషన్ ఉండదు. అంటే వీళ్లు ప్రతి వారం రేషన్ కోసం పోరాటాలు చేయాలి. అంటే గతంలో లగ్జరీ బడ్జెట్ ఉండేది. కానీ, ఇప్పుడు కామన్ సరుకుల కోసం కూడా పోరాడాలి. ఇంక ఆఖరి బ్యాడ్ న్యూస్.. ఎలాంటి ప్రైజ్ మనీ లేదు. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో ప్రైజ్ మనీ జీరో. కాకపోతే వీళ్లు ఆటలు ఆడి.. ఆ ప్రైజ్ మనీని పెంచుకుంటూ పోవాలి. గ్రాండ్ ఫినాలే సమయానికి ఎంత ఉంటే అదే.. ప్రైజ్ మనీ అవుతుంది.

big boss 8 highlits

ట్విస్టులు:

ఈసారి మొదటి నుంచి చెప్తున్న మాట హౌస్ లో టన్నుల కొద్దీ ట్విస్టులు, టర్నులు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి లిమిట్ లెస్ గా ఏం కావాలి అని అడుగుతున్నారు. వాళ్లు తలా ఒక సమాధానం చెప్పారు. అయితే ఈసారి హౌస్ లో ఉండే ట్విస్టులు ఏంటి అనే విషయం మాత్రం క్లారిటీ రాలేదు. కానీ, చివర్లో బిగ్ బాస్ కూడా ఈ విషయంపై కాస్త బిల్డప్ ఇచ్చాడు. అంటే ఈసారి సీజన్ లో ట్విస్టులు, టర్నులు లెక్కలేనన్ని ఉంటాయని చెప్పాడు. అలాగే ఇప్పటివరకు హౌస్ మేట్స్ చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. ఇంకా రాబోయో సినిమాని ఇంటర్వెల్ కూడా లేకుండా చూపిస్తాం అంటూ కాస్త కంగారు పెట్టేశాడు కూడా. మరి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

big boss 8 highlits