iDreamPost
android-app
ios-app

Bigg Boss 8 Promo: ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. RJ శేఖర్ బాషా VS RGV హీరోయిన్ సోనియా..!

  • Published Sep 02, 2024 | 11:29 AM Updated Updated Sep 02, 2024 | 1:31 PM

Bigg Boss Telugu Season 8- RJ Shekar Basha Vs sonia: బిగ్ బాస్ హౌస్ లో ఆటలు మాత్రమే కాదు.. గొడవలు కూడా షురూ అయిపోయాయి. తొలి ప్రోమోలో గట్టి యుద్ధమే జరిగింది. మరి.. ఆర్జే శేఖర్ బాషా vs సోనియా మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

Bigg Boss Telugu Season 8- RJ Shekar Basha Vs sonia: బిగ్ బాస్ హౌస్ లో ఆటలు మాత్రమే కాదు.. గొడవలు కూడా షురూ అయిపోయాయి. తొలి ప్రోమోలో గట్టి యుద్ధమే జరిగింది. మరి.. ఆర్జే శేఖర్ బాషా vs సోనియా మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

  • Published Sep 02, 2024 | 11:29 AMUpdated Sep 02, 2024 | 1:31 PM
Bigg Boss 8 Promo: ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. RJ శేఖర్ బాషా VS RGV హీరోయిన్ సోనియా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంఛ్ అయిపోయింది. ఈసారి హౌస్ లో చాలానే కొత్త కొత్త నిర్ణాయలు, స్ట్రాటజీలు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇలా అసలు ఎందుకు చేశారు? అని ప్రశ్నించడం అంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే హౌస్ లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఏదో ఒక కంటెంట్ కోసమే అవుతుంది. అలా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిలో.. కెప్టెన్ లేకుండా ఉండటం కూడా ఒకటి. ఆ నిర్ణయం వల్ల వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో.. తొలిరోజే కనిపించింది. హౌ స్ లో గొడవలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ ప్రోమోలో అదే విషయం బాగా హైలెట్ అవుతోంది. ఆర్జే శేఖర్ బాషా- ఆర్జీవీ హీరోయిన్ సోనియా మధ్య రచ్చ మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా ఏ సీజన్ లో అయినా కూడా మొదటి రెండ్రోజులు బాగానే ఉంటుంది. ఎందుకంటే అంత తర్వగా ఎవరూ తమ అసలు రూపాన్ని బయట పెట్టరు కాబట్టి బాగానే ఉంటుంది. కానీ, ఈసారి అలా కాదు.. గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. నాగ మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నాం అనగానే.. అతను కోపంతో ఊగిపోయాడు. అతనికి 5 ఓట్లు వేసిన వాళ్లపై కాస్త కన్నెర్ర చేశాడు. ఆ విషయంలో నిఖిల్- నాగ మణికంఠకు చిన్న గొడవ కూడా అయ్యింది. ఆ తర్వాత ఇవాళ వచ్చిన ప్రోమోలో ఇంకో గొడవను హైలెట్ చేశారు. ఆర్జే శేఖర్ బాషా- ఆర్జీవీ హీరోయిన్ సోనియాల మధ్య గట్టిగానే గొడవ జరిగింది. కమలా కాయల విషయంలో వీళ్లు కొట్టేసుకున్నారు.

కామన్ గానే.. బిగ్ బాస్ హౌస్ లో ఏ చిన్న ఖాళీ దొరికినా టైమ్ పాస్ చేయాలి అని చూస్తారు. పైగా స్టార్టింగ్ ఎపిసోడ్ అనగానే చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి కాస్త ఆటలు ఆడుకోవడం సహజమే. అలాగే ఆర్జే శేఖర్ బాషా సహా కొందరు ఇంట్లో ఉన్న ఆరెంజెస్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఆరెంజ్ ని బాల్ మాదిరి విసురుకుంటూ క్యాచెస్ పడుతూ ఆడుతున్నారు. వాళ్ల ఆటలను దూరం నుంచి చూస్తున్న సోనియా కాసేపటి తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇంట్లో ఉన్న ఆరెంజెస్ ని ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ చెప్పింది. ఈ మాట అనగానే ఆర్జే శేఖర్ బాషా స్టార్ట్ చేశాడు. ఫుడ్ తో ఆడకూడదు అని ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించాడు? అందుకు సోనియా కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

కావాలంటే ఎలా పడితే అలవా తినేవాళ్లు ఆడుకోండి. అలా ఆడిన వాటిని ఎవరికీ పెట్టకండి అంది. అంటే కాస్త మనుషుల్లా తినాలి అనుకునే వారికి పెట్టకండి అంటూ తెగేసి చెప్పింది. శేఖర్ బాషా కూడా ఎక్కడా తగ్గకుండా మాట్లాడాడు. ఇందులో తప్పు ఒప్పుల విషయానికి వస్తే.. తినే వాటితో ఆడుకోవడం ముమ్మాటికీ తప్పే. పైగా ఈసారి రేషన్ లేదు. అంటే కావాల్సినవి ఆడి గెలుచుకోవాలి. అలాంటప్పుడు ఉన్నవాటిని చాగ్రత్తగా వాడుకోవాలి. ఈ విషయంలో మాత్రం శేఖర్ బాషాది తప్పు అనే చెప్పాలి. అయితే సీజన్ ఇంకా సరిగ్గా ప్రారంభం కూడా కాలేదు. కాబట్టి.. సోనియా కాస్త నెమ్మదిగా చెప్పుంటే బాగుండేది. అంతలా సీరియస్ స్టేట్మెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఆమెవైపు పాయింట్ ఉంది కాబట్టి సీరియస్ అయి ఉండచ్చు. అంత కోపంగా చెప్పగానే శేఖర్ బాషా కూడా ట్రిగర్ అయ్యాడు. మరి.. వీళ్లిద్దరి గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş