గొడవలతో దద్దరిల్లిపోయింది.. బిగ్ బాస్ 8 సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ లిస్ట్!

Telugu Bigg Boss 8 Day2 Latest Update: తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. తెలుగు లో ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ మొదలైంది.

Telugu Bigg Boss 8 Day2 Latest Update: తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. తెలుగు లో ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ మొదలైంది.

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ 8 లో అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీలు, కుతంత్రాలు, సింపథీలు, గాసిప్స్, రొమాన్స్ ఒక్కటేమిటి అన్నీ మిలితమై ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం రైతు బిడ్డ చుట్టూ తిరిగిందనే విమర్శలు వచ్చాయి. నిన్న సోమవారం నామినేషన్ పర్వం మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య యద్దవాతావరణమే కనిపించింది. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ హీట్ హీట్ గా సాగింది. నామినేషన్స్ ఎలా ఉండాలో అప్పుడే చూపించారు ఇంటి సభ్యులు. నిఖిల్ , యష్మి, నైనిక చీఫ్స్ గా ఎన్నుకున్న తర్వాత వీరి మెడలలో ఓ పూసల దండ వేయించి సపరేట్ కుర్చీలు వేసి కూర్చోబెట్టారు బిగ్ బాస్. మిగిలిన వారిని నామినేషన్స్ లో నిలబెట్టారు. సోనియాతో మొదలు పెట్టారు.. ఈ అమ్మడు తన వాయిస్ పెంచి బేబక్కను టార్గెట్ చేసింది. కిచన్ హ్యాండిలింగ్ మీద గట్టిగా మాట్లాడింది. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన చీఫ్ లకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. తర్వాత ప్రేరణను నామినేట్ చేసింది. నువ్వ ఇది పిక్నిక్ లా ఎంజాయ్ చేయడానికి వచ్చావా? అంటూ ప్రశ్నించింది. దీనికి ప్రేరణ పెద్ద వాయిస్ తో డిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నించింది.

మొత్తానికి సోనియా లాజిక్ లకు సైలెంట్ అయ్యింది ప్రేరణ. ఆ తర్వాత సోనియా ఎలిమినేట్ చేసిన వారిలో చీఫ్ యాష్మి బెబక్కను సెలక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత నబీన్ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. కెమెరాల ముందు ఏదో మాట్లాడుతాడు.. అందరితో మింగిల్ అవడం లేదు అని చెప్పాడు. దానికి మణికంఠ తన వ్యక్తిగత పరిస్థితి చెప్పడం మొదలు పెట్టాడు. అంతలో చీఫ్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చి బ్రేక్ వేశాడు. తర్వాత నబీన్ బేబక్కను నామినేషన్ చేశాడు. తర్వాత యాష్మి వచ్చి బేబక్కను సేవ్ చేసింది. శేఖర్ భాషా వచ్చి మణికంఠ, బేబక్కను నామినేట్ చేశాడు. మణి, శేఖర్ మధ్య వాగ్వాదం బాగానే జరిగింది. బేబక్క రూల్స్ పెడుతుందని ఆరోపణ చేశాడు శేకర్ బాషా. ఇక చీఫ్ నైనిక ఎంట్రీ ఇచ్చి మణికంఠను నామినేష్ చేసింది.

ఫృథ్వి రాజ్, నబీల్ ని బేబక్క నామినేట్ చేసింది. ఫృథ్విలో హెల్పింగ్ నేచర్ లేదని అనండంతో తన పని కానపుడు చేయనని చెప్పాడు. ఇలా ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్దం అయ్యింది. తర్వాత నబీల్ నీ నువు ఎవరితో కలవడం లేదు, వాయిస్ ఇంకా పెంచాలి అంటూ సజేషన్ ఇచ్చింది బేబక్క. ఇక నామినేషన్ సమయంలో నిఖిల్- సీత మధ్య పెద్ద గొడవే జరిగింది. చీఫ్ నిఖిల్ వచ్చి ఫృథ్విని నామినేషన్ చేశాడు. మొత్తంగా తొలి వారం నామినేషన్ లో బేబక్క, మణికంఠ, ఫృథ్విరాజ్ నిలిచారు. మూడో ఎపిసోడ్ లో కొనసాగనుంది.. ఇందులో మరో ఏడుగురు సోనియా, విష్ణుప్రియ, శేఖర్ బాషా కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments