iDreamPost
android-app
ios-app

Big Boss 8: సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

  • Published Nov 23, 2024 | 5:30 PM Updated Updated Nov 23, 2024 | 5:30 PM

Big Boss 8: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది.

Big Boss 8: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది.

  • Published Nov 23, 2024 | 5:30 PMUpdated Nov 23, 2024 | 5:30 PM
Big Boss 8: సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తో బాగా పాపులర్ అయిన వారిలో సోనియా ఆకుల ఒకరు. ప్రతి సీజన్లో ఇలాంటి వైరల్ హౌస్ మేట్ కచ్చితంగా ఉంటారు. ఈ సీజన్లో మాత్రం ఈమె తన ఆట తీరుతో బాగా వైరల్ అయ్యిందనే చెప్పాలి. ఇక తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించింది. అయినా కూడా ఆమెకు పెద్ద గుర్తింపేమి రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే ఆమె బాగా ఫేమస్ అయ్యింది. మొదట్లో తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందికి నచ్చలేదు. పైగా ఆమె ఆట తీరు కూడా మారిపోయింది. దాంతో చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా కేవలం నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. నామినేషన్స్ లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా పాపులర్ అయ్యింది. పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తుంది సోనియా. ఇక తాజాగా తన ఫ్యాన్స్ కు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ యష్ తో సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. శుక్రవారం కేవలం ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో సోనియా- యష్ ల నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు ఇంకా నెటిజన్లు సోనియా-యష్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది సోనియా. యష్ తో తనకు మూడు సంవత్సరాల పరిచయం ఉందని, బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలనుకున్నామని చెప్పింది. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని స్వయంగా తన ప్రియుడే తనను ఈ షోకి పంపాడని కూడా చెప్పుకొచ్చింది. ఇక యష్ విషయానికి వస్తే.. అతనికి గతంలోనే పెళ్లి అయ్యిందట. తన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత సోనియాతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని సోనియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సోనియా ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet