Bigg Boss 7 Telugu: మూడో వారం హౌస్ నుంచి ఆ బ్యూటీనే ఎలిమినేషన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్స్ తో పోలిస్తే.. ఉల్టా పుల్టాకి మంచి రెస్పాన్స్ వస్తోందనే చెప్పాలి. ప్రేక్షకుల్లోకి ఈ సీజన్ ను, కంటెస్టెంట్స్ ని తీసుకెళ్లడంతో టీమ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ గురించి బాగా చర్చ జరుగుతోంది. ఎవరు ఎలా ఆడుతున్నారు? ఎవరిది ఫెయిర్ గేమ్? ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్? ఎవరు మాస్క్ వేసుకుని ఆడుతున్నారు? ఇలా ప్రతి విషయంపై తమ అభిప్రాయాలను బలంగానే వినిపిస్తున్నారు. అయితే మూడోవారం కూడా చివరకు వచ్చేసింది. మరి వీకెండ్ అనగానే.. మస్తీ ఎలా అయితే ఉంటుందో.. ఎలిమినేషన్ కూడా ఉంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రాణం పెట్టి ఆడుతున్నవాళ్లు ఉన్నారు.. సరేలే వచ్చాం కదా అని ఆడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. ఎవరి ఆట ప్రేక్షకులకు నచ్చితే వాళ్లు హౌస్ లో కొనసాగుతూ ఉంటారు. ఎవరు జెన్యూన్ అని అనుకుంటారో.. ఎవరి ప్రదర్శన బాగా ఉంటుందో వారికే ఓటింగ్ లో పట్టం కడతారు. మరి.. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ అంతా బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. నిజానికి ఈ వీక్ లో మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ధామినీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శుభశ్రీ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో కంటెంట్, ఫాలోయింగ్, ఎక్స్ ట్రా కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి తక్కువ ఓట్లు పడతాయి అనే విషయాలను పరిశీలిద్దాం.

ఈ వీక్ లో గేమ్, టాస్కులు, ఓట్లు పరంగా చూసుకుంటే ఇప్పటికే అమర్ దీప్, ప్రియాంక జైన్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. అనధికారిక ఓటింగ్ లో అమర్ దీప్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అలాగే ప్రియాంక జైన్ కు కాడా ఓట్లు బాగానే పడుతున్నట్లు టాక్ వస్తోంది. ఆ తర్వాత ఈ వీక్ బాగా హైలెట్ అయిన వాళ్లలో శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ఉంటారు. శోభాతో జరిగిన గొడవ గౌతమ్ కు బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఓటింగ్ లో గౌతమ్ కూడా సత్తా చాటుతున్నాడు. లాస్ట్ వీక్స్ తో పోలిస్తే.. గౌతమ్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అలాగే షకీలా కూడా గౌతమ్ గురించి చాలా మంచి కామెంట్స్ చేసింది. అది కూడా అతనికి ప్లస్ అయింది. ఇంక నామినేషన్స్ లో ఉన్నా వారిలో ప్రిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హౌస్ లో ప్రిన్స్ ని టార్గెట్ చేసి.. అతని అవకాశాలను దూరం చేసినన్ని రోజులు అతను నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

అందరూ పాపం.. ప్రిన్స్ యావర్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ప్రిన్స్ కూడా అతని వర్షన్ ని చాలా క్లియర్ గా చెబుతున్నాడు. పాయింట్ ఉన్న దగ్గర గట్టిగా మాట్లాడుతున్నాడు. అతనికి అన్యాయం జరుగతోందనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. వాళ్లు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు.. అతనికి ఓట్లు కూడా వేస్తున్నారు. ఇంక నామినేషన్స్ లో ఉన్న శుభశ్రీ, రతికా రోజ్, ధామిని విషయానికి వస్తే.. రతికాకు ఓటింగ్ కాస్త తక్కువగా ఉందనే చెప్పాలి. అలాగే ఆమెకు ఈ వీక్ చాలా నెగెటివ్ అయింది. ప్రశాంత్ తో కాసేపు మాట్లాడటం, తర్వాత గొడవ పెట్టుకోవడం, మళ్లీ దగ్గరవుతున్నట్లు చేయడం, ప్రిన్స్ యావర్ తో పులిహోర ఎపిసోడ్ ఇలా ఇవన్నీ ఆమెకు నెగిటివ్ అవుతున్నాయి. అలాగే రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్టులు కూడా రతికాకు బాగానే నెగిటివీటిని మూటకట్టాయి.

ఇంక శుభశ్రీ గేమ్ పరంగా తన గళాన్ని గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. గౌతమ్ తో ట్రాక్ ఉండీ లేనట్టుగా కొనసాగుతోంది. ఆ పాయింట్ శుభశ్రీకి కాస్త ప్లస్ అనే చెప్పాలి. వీళ్లిద్దరు ఓటింగ్ లో వీళ్లు లాస్ట్ నుంచి రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంక మిగిలిన ఒకే ఒక కంటెస్టెంట్ ధామిని. ఆమె వంటలక్క అనే ముద్రను తొలగించుకునేందుకు చాలానే కష్టపడుతోంది. అయితే టాస్కుల పరంగా ధామినీ పర్ఫార్మెన్స్ అంత కనిపించడం లేదనే చెప్పాలి. అలాగే హౌస్ లో తన పాయింట్ ని గట్టిగా చెప్పలేకపోతోంది. ఎక్కడ గొడవ జరిగినా దూరంగా వెళ్లిపోతోంది. ఈ పనులు అన్నీ తనని తాను వీక్ అని పోట్రే చేసుకున్నట్లు ప్రేక్షకులకు అర్థమైనట్లు ఉంది. ఓటింగ్ పరంగా ఈ వీక్ ధామినీనే లాస్ట్ ప్లేస్ లో ఉందని చెబుతున్నారు. అలాగే ఈ వీక్ ఆమే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments