iDreamPost
android-app
ios-app

Amardeep Chowdary: వారికి అమర్ స్ట్రాంగ్ వార్నింగ్.. కొట్లాటకైనా రెడీ అంటూ..

  • Published Jan 12, 2024 | 3:30 PM Updated Updated Jan 12, 2024 | 3:30 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. కానీ, ఆ షో గురించి మాత్రం ఇంకా ఏదొక వార్త బయటకు వస్తూనే ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. కానీ, ఆ షో గురించి మాత్రం ఇంకా ఏదొక వార్త బయటకు వస్తూనే ఉంది.

  • Published Jan 12, 2024 | 3:30 PMUpdated Jan 12, 2024 | 3:30 PM
Amardeep Chowdary: వారికి అమర్ స్ట్రాంగ్ వార్నింగ్.. కొట్లాటకైనా రెడీ అంటూ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ షో ఇంపాక్ట్ మాత్రం పోవడం లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఆ సీజన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా విన్నర్, రన్నర్ గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది. అయితే విన్నర్ కంటే కూడా ఎక్కువగా రన్నర్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే అతనిపై ఎంత ట్రోలింగ్ నడిచినా కూడా.. ఎంతమంది టార్గెట్ చేసి తిట్టినా కూడా అమర్ దీప్ మాత్రం ఎంతో చక్కగా సమాధానం చెప్పాడు. ఆఖరకి తల్లి ముందే అనకూడని మాటలు అన్నా కూడా సైలెంట్ గా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో అమర్ దీప్ ఓపెన్ అయ్యాడు. ఆ రోజు జరిగిన దాని గురించి తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేశాడు. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

సాధారణంగా ఒక వ్యక్తిని మానసికంగా దెబ్బతీయాలి అంటే ముందు వారి బలం మీద కొట్టాలి. అమర్ విషయంలో కూడా హేటర్స్ అదే పని చేసినట్లు అమర్ చెప్తున్నాడు. తనకు సపోర్ట్ గా ఉన్న తన కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నాడు. అలా అయితే తనకి సపోర్ట్ తగ్గిపోతుందని అలాంటి పనులు చేశారన్నాడు. తన తల్లికి, భార్యకు పెట్ట కూడని ఫొటోలు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారి అలాంటి ఫొటలు పంపాలని అనుకున్న వాళ్లు వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఉండే అమ్మ, అక్క, భార్య, చెల్లికి చూపించి బాగానే ఉంది.. పంపచ్చు అంటే పంపండి అంటూ తన బాధను తన మాటల్లో వ్యక్త పరిచాడు. ఒకరైతే తన తల్లి ముందే తనని లం* కొడకా అని తిట్టాడని.. అలా వాళ్ల తల్లి ముందు వాడిని తిడితే ఎలా ఉంటుందని అమర్ ప్రశ్నించాడు. వాళ్లంతా బిర్యానీకీ, నోటుకు వచ్చిన వాళ్లంటూ చెప్పాడు.

వందలో 90 మంది తిట్టుకున్నా.. పది మంది తనని సపోర్ట్ చేసే వాళ్లు ఉంటే చాలని అమర్ కోరుకున్నాడు. తాను హౌస్ లో ఉన్నప్పుడు తన కుటుంబానికి మాత్రమే కాకుండా.. తనకు సపోర్ట్ చేసిన అమ్మాయిలకు కూడా అసభ్యకర చిత్రాలు పెట్టారని చెప్పాడు. తనకి మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికి అమర్ ధన్యవాదాలు చెప్పాడు. అలాగే మిత్రుల పేరుతో తనని సపోర్ట్ చేయకుండా ఉన్న వాళ్లను ఉద్దేశించి కూడా అమర్ కామెంట్స్ చేశాడు. మొదటి ఐదు వారాల్లో ఎవరైతే తనతో ఉన్నారో.. వాళ్లే తన ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనని హేట్ చేసే వాళ్లకు.. అమర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తల్లీ, భార్య, ఇంట్లో ఆడవాళ్లని తిట్టకుండా తనని ఏమైనా అనుకోమని చెప్పాడు.

“మాట్లాడుకుందాం అన్నా వచ్చేయండి. అలాగే ఖాళీ గ్రౌండ్ కి వస్తే తిట్టుకుందాం.. కావాలంటే కొట్టుకుందాం.. అంతగా అయితే సిట్టింగ్ లో అయినా కొట్టుకుందాం” అంటూ అమర్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు ఎంత ట్రోల్ చేసినా.. ఎంత అసభ్యంగా ప్రవర్తించినా.. అమర్ గానీ, అతని కుటుంబం గానీ ప్రదర్శించిన సంయమనం, చూపించిన సహనం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అమర్ దీప్ ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibomjojobet giriş