iDreamPost
android-app
ios-app

తండ్రి అయిన బిగ్ బాస్ అర్జున్.. ఎమోషనల్ పోస్ట్..!

వరల్డ్ ఫేమ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు లో వస్తుంది. కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సీజన్ కి విన్నర్ రైతు బి్డడ పల్లవి ప్రశాంత్.. రన్నర్ గా అమర్ దీప్ నిలిచారు.

వరల్డ్ ఫేమ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు లో వస్తుంది. కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సీజన్ కి విన్నర్ రైతు బి్డడ పల్లవి ప్రశాంత్.. రన్నర్ గా అమర్ దీప్ నిలిచారు.

తండ్రి అయిన బిగ్ బాస్ అర్జున్.. ఎమోషనల్ పోస్ట్..!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుంచి మొన్న ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ అంతా ఊల్టా ఫుల్టా అంటూ తెలుగు ప్రేక్షకుల  ముందుకు వచ్చారు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే సీజన్ లో ఉల్టా ఫుల్టా గేమ్స్, ఎంట్రీలతో సందడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 కి మొదట 14 మంది ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ గుడ్ న్యూస్ షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..

కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి అంతా ఉల్టా.. ఫుల్టాగా కొనసాగింది. 105 రోజులు ప్రతిరోజూ ఏదో ఒక ట్విస్ట్ తో సందడిగా సాగింది. మొదట 14 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఎమోషన్స్, మాటల యుద్దం, చిత్రమైన గేమ్స్ తో బిగ్ బాస్ ఇంటి సభ్యులు నువ్వా.. నేనా అన్న చందంగా ఆడారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కంటెంస్టెంట్స్ వెంట వెంటనే వెళ్లిపోగా.. చివరి వరకు తనదైన గేమ్ ఆడుతూ అందరి హృదయాలు గెల్చుకున్నాడు అంబటి అర్జున్. తాజాగా అంబటి అర్జున్.. పండంటి ఆడబిడ్డ తమ జీవితాల్లోకి అడుగు పెట్టిందన్న సంతోషకరమైన వార్తను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో తన భార్య సురేఖ గురించి చెబుతూ ఎప్పుడూ ఎమోషన్ అవుతూ ఉండేవాడు.

big boss arjun

తన భార్య ప్రెగ్నెన్సీ సమయంలో తాను దగ్గర ఉండలేకపోతున్న బాధను తోటి ఇంటి సభ్యులతో చెబుతూ బాధపడేవాడు. అంబటి అర్జున్ బాధ చూసి బిగ్ బాస్ కూడా కరిగిపోయాడు.. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ హౌజ్ లో అర్జున్ భార్య సురేఖ సీమంతాన్ని జరిపించాడు. ఈ సీన్ చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు సైతం ఎంతో ఎమోషన్ కి గురై కన్నీరు పెట్టుకున్నారు. అంబటి అర్జున్ ఓ సందర్భంగా కింగ్ నాగార్జునకు ఇంటి సభ్యులుకు, ఆడియన్స్ కి ముందుగానే తనకు పుట్టబోయే సంతానం పేరు చెప్పాడు. అర్జున్ నుంచి అర్.. సురేఖ నుంచి ఖ తీసుకొని ‘అర్ఖా’ అని పేడతానని చెప్పాడు. అది పాప అయినా.. బాబు అయినా ఎవరైనా సరే అర్ఖా పేరు ఫిక్స్ చేసుకున్నామని తెలిపాడు. అంతేకాదు తనకు ఖచ్చితంగా కూతురు పుడుతుందని చెప్పాడు. అనుకున్నట్లుగా సురేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అర్జున్ బుల్లితెరపై పలు షోలు, టీవీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటిస్తున్నాడు. అంబటి అర్జున్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి