iDreamPost

పొలం గట్ల మీద బీడీ తాగుతూ కనిపించిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్

  • Published Jun 11, 2024 | 12:41 PMUpdated Jun 11, 2024 | 12:57 PM

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా వారిలో రతికా రోజ్ కూడా ఒకరు. అయితే ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుదో అందరికీ తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా రతికా కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా వారిలో రతికా రోజ్ కూడా ఒకరు. అయితే ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుదో అందరికీ తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా రతికా కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Jun 11, 2024 | 12:41 PMUpdated Jun 11, 2024 | 12:57 PM
పొలం గట్ల మీద బీడీ తాగుతూ కనిపించిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్

‘రతికా రోజ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కాగా, ఈమె బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా.. గతంలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. కానీ,ఆ సినిమాలేవి ఈ అమ్మాడుకు అంతా ఫేమ్ ను తెచ్చిపెట్టలేదు. అయితే బిగ్ బాస్ షో మాత్రం రతికాకు మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు. ఇక ఈ షోలో ఆమె ఆట తీరుతో కంటెస్టెంట్స్ లకే కాకుండా.. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచేలా చేసింది. ముఖ్యంగా తన డిఫరెంట్ షేడ్స్ ను ప్రదర్శిస్తూ.. రతిక నిత్యం బిగ్ బాస్ హోస్ లో కాంట్రవర్సీని క్రియేట్ చేసేది. ఇలా తన తీరుతో ప్రేక్షకులకు చిరకు తెప్పించడమే కాకుండా.. బిగ్ బాస్ హోస్ నుంచి నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. అయితే మళ్లీ సెకండ్ ఛాన్స్ తో హోస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ గేమ్ కన్ఫ్యుజింగ్ గా సాగింది.ఈ క్రమంలోనే 12వ వారం ఆమె బిగ్ బాస్ హోస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా రతికా రోజ్ కు మళ్లీ నటిగా ఆఫర్స్ క్యూ కట్టాయి. అంతేకాకుండా.. మరో వైపు బుల్లితెర పై కూడా సందడి చేస్తుంది. ఇక పలు షోల్లో, సినిమాల్లోనే కాకుండా.. రతికా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తరుచు తనకు సంబంధించిన ఏదో ఒక వీడియోలు,ఫోటోస్ షేర్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా రతికాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోను రతికానే తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా, ఆ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ వీడియోలో రతికా పొలాల్లో దమ్ము కొడుతూ మాస్ అవతార్ లో దర్శనం ఇచ్చింది. ఇక ఆమె లంగా ఓణీ కట్టి..పొలాల్లో సైకిల్ పై వెళుతూ బీడీ తాగుతూ కనిపించింది.

అయితే ఇదంతా రీల్ కోసం చేసిందట అమ్మాడు. కాగా, ఐకాన్ స్టర్ అల్లు అర్జున్-రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది.ఇక ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘సూసేకి’ ఇటీవలే విడుదలైంది. అయితే సదరు సాంగ్ లో రీల లో నటించిన రతిక రోజ్ ఇలా బీడీ తాగుతూ వీడియోను షేర్ చేసింది. ఇక అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ నెట్టంట రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రతికా వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Rathika Ravinder (@rathikaravinder)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి