iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ నుండి శివాజీ బయటకి! ఈసారి ఏకంగా ఇంటికే?

  • Author singhj Published - 03:52 PM, Sat - 21 October 23

బిగ్ బాస్ సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా పేరు తెచ్చుకున్న శివాజీ హౌస్ నుంచి బయటకు రానున్నారని తెలుస్తోంది. ఈసారి ఏకంగా ఆయన ఇంటికే వెళ్లనున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..

బిగ్ బాస్ సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా పేరు తెచ్చుకున్న శివాజీ హౌస్ నుంచి బయటకు రానున్నారని తెలుస్తోంది. ఈసారి ఏకంగా ఆయన ఇంటికే వెళ్లనున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..

  • Author singhj Published - 03:52 PM, Sat - 21 October 23
బిగ్ బాస్ నుండి శివాజీ బయటకి! ఈసారి ఏకంగా ఇంటికే?

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే తక్కువ. వచ్చిన అరా కొర అవకాశాలను వాడుకొని గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయితే కొందరికి మంచి ఇమేజ్ వచ్చినా, దాన్ని నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతుంటారు. చాన్నాళ్ల పాటు పరిశ్రమలో కొనసాగినా పాపులారిటీ, క్రేజ్ సాధించడంలో విఫలం అవుతారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోలుగా మారిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోలుగా సెటిలయ్యారు. మిగతా వాళ్లు మాత్రం సినిమాలు తగ్గిపోవడంతో క్రమంగా కనుమరుగైపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను స్టార్ట్ చేసిన శివాజీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగానూ పలు సక్సెస్​లు సాధించి తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆయన ఫిల్మ్ కెరీర్ అనుకోని విధంగా త్వరగా ముగిసింది.

సినిమా కెరీర్ అనూహ్యంగా క్లోజ్ అయినా పొలిటికల్​గా చాలా యాక్టివ్​గా అయి.. ప్రజలకు చేరువయ్యారు శివాజీ. అలా వచ్చిన క్రేజ్​తోనే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్-7లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్​లో ఉన్న యంగ్ జనరేషన్​తో బాగా పోటీపడ్డారు. మొదట్లో తన మీద వచ్చిన అన్ని అనుమానాలను పటాపంచలు చేసి బెస్ట్ గేమ్ ఆడుతూ స్ట్రాంగ్ కంటెండర్​గా పేరు తెచ్చుకున్నారు శివాజీ. టాస్క్​ల విషయంలో తగ్గేదేలే అనేలా ఆడుతూ.. హౌస్​లోని కుర్రాళ్లకు మంచి, చెడులను నిర్దేశిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. బిగ్ బాస్-7 సగం సీజన్ పూర్తయింది. ఈ సీజన్ ఫైనల్స్​ లిస్ట్​లో శివాజీ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. అయితే ఈ టైమ్​లో శివాజీ ఎలిమినేట్ అవుతారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్​లో ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ పోటీ జరుగుతోంది. ఈ పోటీ ఫైనల్​లోకి ఆట సందీప్​తో పాటు అర్జున్ అంబటి వెళ్లారు. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేయగా.. ఆ తర్వాత అనారోగ్యంగా ఉన్న శివాజీని కన్ఫెషన్ రూమ్​లోకి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ తన హెల్త్ కండీషన్ గురించి చెబుతూ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను టైగర్​నని, ఎవరికీ భయపడనని చెప్పిన శివాజీ.. చేతికైన గాయం బాధిస్తోందని, దీని వల్ల ఆటకు న్యాయం చేయలేకపోతున్నానని వాపోయాడు. అందరి ముందూ ఏడవలేనని.. తనను పంపించేయాలని బిగ్ బాస్​ను కోరాడు శివాజీ. అయితే ఈ విషయంలో డాక్టర్​ను సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నాడు బిగ్ బాస్.

శివాజీని ధైర్యంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, ఇంజ్యురీ కారణంగా ఆయన సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌తోపాటు శివాజీనీ హౌజ్ నుంచి పంపేయనున్నారట. ఇంతకుముందు సీజన్-4లో హెల్త్ ఇష్యూస్ కారణంగా గంగవ్వను పంపించిన మాదిరిగానే ఇప్పుడు శివాజీని కూడా పంపించేస్తారని టాక్. తీవ్రమైన చేతినొప్పితో బాధపడుతున్న శివాజీకి సర్జరీ అవసరమట. ఆయనకు 10 రోజులు బెడ్ రెస్ట్ కూడా ఇవ్వాలని డాక్టర్లు సూచించారట. ఇవాళ్టి దసరా ఎపిసోడ్ లోనే శివాజీ గుడ్ బై చెప్పే అవకాశాలు 95 శాతం ఉన్నాయని సమాచారం. మరి.. శివాజీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శివాజీ – మహేష్ బాబు కలిసి నటించిన సినిమా.. ఏదో తెలుసా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet