బిగ్ బాస్ హౌస్ లోకి ప్రశాంత్ తండ్రి.. చిన్న పిల్లాడిలా కన్నీరు

ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. తన ఆటతో ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు తన తండ్రిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చాడు.

ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. తన ఆటతో ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు తన తండ్రిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చాడు.

ఫ్యామిలీ వీకెండ్ లో ప్రేక్షకుల గుండెలు పిండేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో హౌస్ మొత్తం ఎమోషనల్ గానే ఉంటోంది. ఇన్ని రోజుల తర్వాత తమ కుటుంబాన్ని చూస్తున్న హౌస్ మేట్స్ సొంత వారిని పట్టుకుని ఏడ్చేస్తున్నారు. అలాగే వారి ఆట ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఇంకా మిగిలి ఉంది కేవలం 5 వారాలు మాత్రమే. అయితే 4 వారాల తర్వాత ఎవరు ఫైనలిస్టులు అవుతారు అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అప్పటివరకు వాళ్లకు ఈ ఎనర్జీ సరిపోతుంది. ఇప్పటివరకు చూసిన ఎమోషనల్ ఎపిసోడ్స్ ఒకెత్తు.. ఇప్పుడు చూడబోతున్నది ఒకెత్తు అని చెప్పాలి. ఎదుకంటే పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ కూడా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఆడియన్స్ ని కూడా ఏడిపించేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా వచ్చాడు. అతనికి సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి హౌస్ లో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలతో పోలిస్తే పల్లవి ప్రశాంత్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అయితే వీళ్లు సీరియల్స్, సినిమాలు అంటూ ఎప్పుడూ ప్రేక్షకుల ముందు ఉంటారు. కాకపోతే ప్రశాంత్ మాత్రం చాలా మందికి తెలియదు. కానీ, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత.. పల్లవి ప్రశాంత్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ లా మారిపోయింది. రైతుబిడ్డ అనేది ఒక ట్యాగ్ లైన్ లా మార్చేశాడు. ఎవరిని కదిలించినా కూడా మా రైతుబిడ్డ అంటూ ఓన్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి రావడంతో ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ముందుగా బంతి పూలను ఇంట్లోకి పంపారు. అవి చూసి ప్రశాంత్ కన్నీల్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాబు బంగారం అంటూ ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి వచ్చారు. పరుగున వెళ్లి తండ్రి కాళ్ల మీద పడ్డాడు. నిన్ను చూసి ఇన్నిరోజులు అయ్యింది అంటూ ప్రశాంత్ ఏడ్చేశాడు. తండ్రి కూడా కొడుకుని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

హౌస్ లో ఉన్న అందరినీ దగ్గరితో ప్రశాంత్ తండ్రి మాట్లాడారు. ఎవరూ కూడా కొట్టుకోకుండా బాగా ఆడాలని కోరారు. శివాజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తండ్రిని పైకి ఎత్తుకుని ప్రశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన తండ్రికి అన్న తీసుకొచ్చి ప్రశాంత్ తినిపించాడు. తండ్రి కూడా తన కొడుకుని చాలా రోజుల తర్వాత ప్రేమగా గోరు ముద్దలు తినిపించారు. వాడు లేకపోతే నేను లేను.. నేను చచ్చేదాకా వాడు నా దగ్గరే ఉండాలి అంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. హౌస్ లో అందరూ ఈ తండ్రీ కొడుకలను చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రశాంత్ కి గేమ్ గురించి కొన్ని సూచనలు కూడా చేశారు. నీ టాలెంట్ ఉపయోగించుకో.. ఏం జరిగినా ఏడవకు, అమ్మ నిన్ను చూసి ఏడుస్తోంది. ఆమెకు బీపీ పెరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే హౌస్ లో తండ్రితో కలిసి పల్లవి ప్రశాంత్ డాన్స్ చేశాడు. తండ్రి కూడా కొడుకులాగానే తొడకొట్టి మీసం మెలేశారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లోకి తన తండ్రిని తీసుకుని వచ్చాడు. ఈ ప్రోమో చూస్తుంటే కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. ఈ ఎమోషనల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments