iDreamPost
android-app
ios-app

Naga Manikantha: వీడియో: నాగ మణికంఠ ఎమోషనల్.. డబ్బులు అడుక్కుని అమ్మకు అంత్యక్రియలు చేశా!

  • Published Sep 04, 2024 | 11:04 AM Updated Updated Sep 04, 2024 | 11:04 AM

Bigg Boss Telugu 8 latest Promo- Naga Manikantha: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్ నడుస్తోంది. ఈసారి కూడా గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల మధ్యలో నాగ మణికంఠ ఎమోషనల్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

Bigg Boss Telugu 8 latest Promo- Naga Manikantha: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్ నడుస్తోంది. ఈసారి కూడా గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల మధ్యలో నాగ మణికంఠ ఎమోషనల్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

  • Published Sep 04, 2024 | 11:04 AMUpdated Sep 04, 2024 | 11:04 AM
Naga Manikantha: వీడియో: నాగ మణికంఠ ఎమోషనల్.. డబ్బులు అడుక్కుని అమ్మకు అంత్యక్రియలు చేశా!

బిగ్ బాస్ హౌస్ లో తొలివారం నామినేషన్స్ హీటు పెంచేశాయి. ఎవరికి వాళ్లు తమ పాయింట్స్ చెప్తూ గొడవలు కూడా పడ్డారు. కొన్ని వాలిడ్ అనిపించినా కూడా.. కొన్నిమాత్రం అస్సలు కరెక్ట్ కాదు అనిపిస్తోంది. ఎందుకంటే తొలివారం కాబట్టి కచ్చింతగా రీజన్స్ ఏమీ ఉండవు. కానీ, టాస్కులు స్టార్ట్ కావడంతో కాస్త మంచి రీజన్స్ చెప్పే నామినేట్ చేస్తున్నారు. నామినేషన్స్ మెయిన్ గా నాగ మణికంఠ టార్గెట్ అయ్యాడు. అందరూ నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు. మింగిల్ అవ్వడం లేదు అంటూ చెబుతున్నారు. అందుకు చివరికి నాగ మణికంఠ ట్రిగర్ అయ్యి.. ఎమోషనల్ అయిపోయాడు. తాను పడిన కష్టాలు ఎవరికీ తెలియవని.. అంటూ తన కష్టాలను చెప్పుకొచ్చాడు. హౌస్ మొత్తం ఎమోషనల్ అయ్యింది.

“నేను పడిన కష్టాలు మీకు తెలియదు. చిన్నప్పుడే నాన్నను కోల్పోయాను. సవతి తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నాను. మా అమ్మ కూడా చనిపోయింది. చేతిలో డబ్బులు లేకపోతే డబ్బులు అడుక్కుని కట్టె కట్టె పేర్చి ఆమెకు తలకొరివి పెట్టాను” అంటూ నాగ మణికంఠ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అతని మాటలకు హౌస్ లో ఉన్నవాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. చీఫ్స్ గా ఉన్న నైనికా కూడా ఎంతో బాధ పడింది. అలాగే యష్మీ గౌడ అయితే కన్నీళ్లు పెట్టేసుకుంది. ఎంతగానో ఏడ్చింది. అప్పటి వరకు హీట్ పుట్టించిన నామినేషన్స్ లో ఒక్కసారిగా అందరూ ఏడ్చేశారు. నాగ మణికంఠ కలవడం లేదు అని అంతా నామినేట్ చేస్తున్నారు. కానీ, అతను ఎందుకు అలా అయ్యాడు అనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాడు.

ఈ నామినేషన్స్ లో చాలానే పాయింట్స్ హెలెట్ అయ్యాయి. సీత కూడా తన నామినేషన్స్ చెప్పింది. తను బేబక్కను నామినేట్ చేస్తూ ఒక్క కూరే చేయాలి అని చెప్పి.. రాత్రి రెండు కూరలు చేశారు అనింది. అయితే చికెన్ అని నాన్ వెజ్ తినని వారికోసం ఆలూ కర్రీ చేశారు. అదే పాయింట్ ని సీత చెప్పింది. అయితే అది కచ్చింతగా కరెక్ట్ పాయింద్ కాదు. నాన్ వెజ్ తినని వాళ్లను చికెన్ తిను లేదంటే కడుపు మాడ్చుకో అని చెప్పలేం. కాబట్టి ఆ పాయింట్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ఇంక ఈ ప్రోమోలో.. చాలానే వాదోపవాదనలు కనిపిస్తాయి. ఒకరిపై ఒకరు కేకలు కూడా వేసుకున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ లో కూడా గట్టిగానే గొడవలు జరిగేలా ఉన్నాయి. మరి.. ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş