iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: పల్లవి ప్రశాంత్‌ ఎఫెక్ట్‌.. ఇకపై వాళ్లకు నో ఎంట్రీ!

  • Published Aug 08, 2024 | 3:23 PM Updated Updated Aug 08, 2024 | 3:23 PM

Bigg Boss 8-No Commoners: త్వరలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం పల్లవి ప్రశాంతే అంటున్నారు. ఆ వివరాలు..

Bigg Boss 8-No Commoners: త్వరలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం పల్లవి ప్రశాంతే అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 08, 2024 | 3:23 PMUpdated Aug 08, 2024 | 3:23 PM
Bigg Boss 8: పల్లవి ప్రశాంత్‌ ఎఫెక్ట్‌.. ఇకపై వాళ్లకు నో ఎంట్రీ!

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. రైతు బిడ్డగా, కామన్‌ మ్యాన్‌గా బిగబాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌.. హౌస్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ పండిస్తూ.. టాస్కుల్లో టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తూ.. సెలబ్రిటీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి.. ఫైనల్‌గా విజేతగా నిలిచాడు. ఓ కామన్‌ మ్యాన్‌, అందునా రైతు బిడ్డ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవడం ఇదే తొలిసారి. ఇంత వరకు బాగానే ఉంది. ఇక ఫైనల్‌ ఎపిసోడ్‌ తర్వాత.. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ అన్నపూర్ణ స్టూడియో వద్ద నానా రచ్చ చేశారు. మిగతా కంటెస్టెంట్ల కార్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. ఇక రన్నరప్‌గా నిలిచిన అమర్‌ కారుపై దాడి చేసి.. అతడి భార్య, కుటుంబ సభ్యులపై దాడి చేసే ప్రయత్నం చేశారు.

అంతటితో ఆగక ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో.. ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాలని పోలీసులు పల్లవి ప్రశాంత్‌కు సూచించారు. అంతేకాక వెనక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల మాట లెక్క చేయని పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించాడు. దాంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. ఇక తాను బిగ్‌బాస్‌ ద్వారా గెలుచుకున్న ప్రైజ్ మనీని పేద రైతులకు పంచుతానని మాటిచ్చాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇవన్ని అతడి విషయంలో తీవ్ర విమర్శలకు దారి తీయడమే కాక.. బిగ్‌బాస్‌ ఇమేజ్‌ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాంతో సీజన్‌ 8 కోసం బిగ్‌బాస్‌ మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి నో ఎంట్రీ అని చెప్పేశారట. ఆ వివరాలు..

సెలబ్రిటీలే కాక చాలా మంది సామాన్యులు సైతం బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని ఆశపడతారు. అయితే అలాంటి వారి ఆశలపై పల్లవి ప్రశాంత​ నీళ్లు కుమ్మరించాడు అని అంటున్నారు. గత సీజన్‌లో అతడిని తీసుకోవడం వల్ల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. బిగ్‌బాస్‌ మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏంటంటే.. ఇకపై సామాన్యులను బిగ్ బాస్ షోకి ఎంపిక చేయకూడదని నిర్వాహకులు నిర్ణయించుకున్నారట. ఇక త్వరలో ప్రారంభం కాబోయే బిగ్‌బాస్‌ 8లో సామాన్యులకు స్థానం లేదని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని ఆశించే సామాన్యులకు తీవ్ర నిరాశ ఎదురు కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8 సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుందని.. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş