iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. OTT సీజన్ 2 పై ప్రకటన!

  • Published Dec 17, 2023 | 6:11 PM Updated Updated Dec 17, 2023 | 6:11 PM

Bigg Boss OTT 2: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Bigg Boss OTT 2: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

  • Published Dec 17, 2023 | 6:11 PMUpdated Dec 17, 2023 | 6:11 PM
బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. OTT సీజన్ 2 పై ప్రకటన!

టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ కూడా ప్రారంభమై..ముగింపుకు చేరుకుంది. ఆదివారం జరిగే బిగ్ బాస్ సీజన్ 7  గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో తేలనుంది. ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. అందుకు ఏమాత్రం తీసిపోకుండా సాగింది. 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. చివరకు ఆరు మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. తాజాగా బిగ్ బాస్-7 కి సంబంధించిన గ్రాండ్ ఫినాలేలో ఓ ఆసక్తికర ప్రకటన వెలువడనుందని టాక్. అదే ఓటీటీలో సీజన్ 2 ఎప్పుడు ప్రారంభం కానుందనే దాని గురించి ప్రకటించబోతున్నారట.

బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఫీవర్‌తో బుల్లితెర ప్రేక్షకులు ఊగిపోతున్నారు. మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతున్న గ్రాండ్ ఫినాలేను చూసేందుకు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలుస్తాడని కొందరు, లేదు అమర్ దీప్ అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొదటి నుంచి సామాన్య ప్రజలకు ఎక్కువగా ఈ సీజన్‌పై ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఓటింగ్‌లో కూడా అమర్‌ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య చాలా గట్టి పోటీ నడించిదని టాక్. స్వల్ప తేడాతో మాత్రమే పల్లవి ప్రశాంత్ విజేత అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫీవర్ పూర్తి కాకముందే ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.

ఆదివారం బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసిన వెంటనే అదే స్టేజ్ మీద నుంచి బిగ్‌బాస్  ఓటీటీ సీజన్ 2ను అనౌన్స్ చేయబోతున్నారట తెలుస్తోంది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకుండా, ఎదురు చూసేలా చేయించకుండా ఈ ఫినాలేలోనే ఓటీటీ సీజన్-2ను ప్రకటిస్తున్నారన్న సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 త్వరలోనే వస్తుందని చెబుతారా? లేక తేదీతో సహా ప్రకటిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

గతంలో వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1 బాగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభానికి ముందు అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు టీవీలో కాకుండా ఓటీటీలో వస్తే ఎవరు చూస్తారులే అని చాలా మంది అభిప్రాయా పడ్డారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రేక్షకులు మాత్రం ఓటీటీ సీజన్‌ను కూడా ఆదరించారు. అందులోనూ కంటెస్టెంట్లు ఓ రేంజ్ లో అదరగొట్టేశారు.

మాములు టీవీలో ప్రసారమయ్యే సీజన్లకు ఏమాత్రం తగ్గకుండా అంతకంటే ఎక్కువ స్టఫ్‌యే ఇచ్చింది. ఈ ఓటీటీ సీజన్ 1  విజేతగా హీరోయిన్ బింధు మాధవి నిలిచిన సంగతి మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఓటీటీ సీజన్ 2కి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారా దానిపై అందరిలో ఉంది. అన్నిటికి సమాధానాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. మరి.. బిస్ బాస్ ఓటీటీ సీజన్ 2 ను ప్రకటించనున్నారనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio