Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తికి మించి సాగుతోంది. ఒక్కొక్కరు హౌస్ మేట్ అయ్యేందుకు తెగ తపన పడిపోతున్నారు. ఇంకా ఒకేఒక్క పవరాస్త్రం ఉంది. దానిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి. అయితే పవరాస్త్రం దక్కించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుని పిచ్చాపాటి మాటలు చెబితే వర్కౌట్ కాదని క్లియర్ గా అర్థమైపోయింది. అంతేకాకుండా శివాజీ డబుల్ గేమ్ కి బిగ్ బాస్ నుంచి బిగ్ గిఫ్ట్ కూడా దక్కింది. అతని పవరాస్త్రం లాగేసుకుని.. మళ్లీ తిరిగి హౌస్ మేట్ గా చేసేశారు. నిజానికి శివాజీ బయాస్డ్ గేమ్, సంచాలక్ గా వ్యవహరించిన తీరు మాత్రమే కాదు.. డబుల్ గేమ్ కి కూడా దక్కిన ప్రతిఫలం అనే చెప్పాలి.
శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున నిప్పులు చెరిగారు. ఒక్కొక్కరిని కడిగిపారేశారు. ముఖ్యంగా సంచాలక్ గా చేసిన సందీప్, శివాజీలకు బాగా క్లాస్ పడింది. సందీప్ ని అయితే వరస్ట్ సంచాలక్ గా తేల్చేశారు. అయితే ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టాస్కులో సందీప్ కి నేరుగా బిగ్ బాస్ నుంచే అక్షింతలు పడ్డాయి. తాజాగా తేజ టాస్కులో గౌతమ్ ని బెల్టు మెడకు వేసిన ఘటనలో సందీప్ కి గట్టిగానే క్లాస్ పడింది. అలాగే శివాజీకి కూడా గట్టిగానే అక్షింతలు పడ్డాయి. గౌతమ్ ఆడుతూ తేజాకి బెల్ట్ వస్తుంటే మెడకు పడుతుంది అంటూ కేకలు వేశాడు.
ఇది కూడా చదవండి: అమర్ వల్లే రతిక ఎలిమినేట్ అయ్యింది..!
ఇది కూడా చదవండి: గీతూపై బూతులతో రెచ్చిపోయిన ధామినీ సోదరి!
టేస్టీ తేజ విచక్షణారహితంగా గౌతమ్ ని కొడుతూ ఉంటే మాత్రం శివాజీ స్పందించలేదు. అదే విషయాన్ని నాగార్జున గట్టిగా అడిగారు. వీక్ పీపుల్ కి అండగా నిలబడతాను అన్నావ్.. ఇక్కడ నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదు అని నాగార్జున తేల్చి చెప్పారు. అలాగే ముగ్గురు సంచాలకుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? వారు పక్షపాత నిర్ణయాలు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అంటూ నాగార్జున అడిగిన విషయం తెలిసిందే. తర్వాత హౌస్ మేట్స్ ముందే శివాజీ, సందీప్, శోభా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అంటూ ప్రశ్నించారు. అందుకు మెజారిటీ ఓట్లు శివాజీకి పడ్డాయి. దాంతో శివాజీ నుంచి పవరాస్త్రం తీసుకుని దానిని బ్రేక్ చేశారు. శివాజీ బ్యాటరీని కంప్లీట్ గా డౌన్ చేశారు. అలాగే తిరిగి మళ్లీ శివాజీ కంటెస్టెంట్ అయిన విషయాన్ని ప్రకటించారు.
శనివారం రాత్రి నుంచి శివాజీ తిరిగి కంటెస్టెంట్ అయిపోయాడు. అతనికి ఉన్న అన్ని సౌకర్యాలు పోయాయి. ఇకపై నామినేషన్స్ లో కూడా ఉంటారు. కాబట్టి ఆట మరింత ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే ఇప్పటివరకు శివాజీ డబుల్ గేమ్ గురించి ఎవరూ కూడా బయట పెట్టెందుకు సరైన అవకాశం దక్కలేదు. ఇకపై కంటెస్టెంట్ కావడంతో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా నామినేషన్స్ లో ప్రకటిస్తారు. గత కొన్నిరోజులుగా శివాజీ ప్రతి విషయానికి నేను వెళ్లిపోతాను, నన్ను పంపేయండి అంటూ వచ్చాడు. ఇప్పుడు కంటెస్టెంట్ కావడంతో త్వరలోనే వెళ్లిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే నాగార్జున, బిగ్ బాస్ నిర్ణయాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. తిరిగి కంటెస్టెంట్ చేయడం వల్ల శివాజీ ఇప్పుడన్నా డబుల్ గేమ కాకుండా మాస్క్ తీసేసి ఆడుతాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. శివాజీని తిరిగి కంటెస్టెంట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.