Tirupathi Rao
పల్లవి ప్రశాంత్ అరెస్టు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటనపై ఒక కామెడీ స్కిట్ చేశారు.
పల్లవి ప్రశాంత్ అరెస్టు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటనపై ఒక కామెడీ స్కిట్ చేశారు.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 క్రియేట్ చేసిన రికార్డులు, వార్తలు అన్నీ ఇన్నీ కాదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీజన్ సాగింది. ఉల్టా పుల్టాకు సార్ధకత తీసుకొస్తూ సీజన్ ఆసాంతం ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సీజన్ సాగింది ఒకెత్తు అయితే సీజన్ ముగిసిన తర్వాత జరిగిన రచ్చ మరొక ఎత్తు అనే చెప్పాలి. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతూ నానా బీభత్సం సృష్టించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఆస్తులు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆఖరికి పోలీసుల వాహనాన్ని కూడా వదిలి పెట్టలేదు. ఇప్పుడు ఈ రచ్చను హైలెట్ చేస్తూ ఒక కామెడీ స్కిట్ చేశారు. అది కూడా శివాజీ ఎదుట చేయడం గమనార్హం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనగానే పల్లవి ప్రశాంత్ గుర్తుకొస్తాడు. ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చి కప్పు కొట్టుకుపోయాడు. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. వాటిని పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ అనగానే మరో రెండు పేర్లు గుర్తొస్తాయి. శివాజీ- యావర్ పేర్లే గుర్తొస్తాయి. వీళ్ల ముగ్గురిని కలిపి స్పై బ్యాచ్ అని పిలిచేవాళ్లు. సీజన్ మొత్తం వీళ్లు ముగ్గురు కలిసే గ్రూపుగానే ఆడారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లు మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నారు. ప్రశాంత్ అరెస్టుపై యావర్, శివాజీ స్పందించారు. అయితే ఇప్పుడు శివాజీ ముందే అతని శిష్యుడు అయిన ప్రశాంత్ అరెస్టు ఇష్యూపై బాబు టీమ్ కామెడీ స్కిట్ చేసింది.
శివాజీ బిగ్ బాస్ కంటే ముందు #90’s వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ బాగా హిట్టు కూడా కొట్టింది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శివాజీ, మౌళీ, వాసంతిక, రోహన్ రాయ్ జబర్దస్త్ షోకి వచ్చారు. ఈ సందర్భంగా రోహన్, మౌళీ స్కిట్స్ లో కూడా చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ, బాబు వాళ్లు పల్లవి ప్రశాంత్ అరెస్టు థీమ్ తో స్కిట్ చేశారు. ఈ విషయంలో శివాజీ కాస్త షాకైనట్లు కనిపించింది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవతోంది. అయితే పాజిటివ్ గా చూపించారా? నెగిటివ్ గా చూపించారా అనే విషయంపై క్లారిటీ లేదు.
కానీ, ఎలా చూపించినా ప్రశాంత్ అరెస్టుకు సంబంధించిన విషయం కాబట్టి శివాజీ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. మధ్యలో కాస్త నవ్వినా కూడా అది ఇబ్బందిగా నవ్వినట్లే కనిపించింది. అయితే శివాజీ అసలు రియాక్షన్ తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇంక శివాజీ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి పేరెంట్స్ గా శివాజీ- వాసుఖీ నటన అందరినీ ఆకట్టుకుంది. మౌళీ, వాసంతిక, రోహన్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ మొత్తానికి రోహన్ క్యారెక్టర్ బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ సిరీస్ కు, డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ కు మంచి మార్కులే వచ్చాయి. మరి.. శివాజీ ఎదుటే ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.