iDreamPost
android-app
ios-app

Rathika Rose: రతిక టాప్ 3 కంటెస్టంట్.. సీక్రెట్ రూమ్ కి పంపండి అంటూ..!

Rathika Rose: రతిక టాప్ 3 కంటెస్టంట్.. సీక్రెట్ రూమ్ కి పంపండి అంటూ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. మామూలు ఉల్టా పుల్టాగా సాగడం లేదు. హౌస్ మొత్తం వీకెండ్ ఎపిసోడ్ తో వణికిపోయింది. హోస్ట్ నాగార్జున బెల్ట్ పట్టుకుని ఒక్కొక్కళ్లని తన మాటలతో ఉతికి ఆరేశాడు. వీక్ లో జరిగిన ప్రతి చిన్న తప్పుని వదిలిపెట్టకుండా వీడియోలతో సహా నిజాలను బయటపెట్టి ఒక్కొక్కరికి క్లాసులు మీద క్లాసులు పీకారు. వీకెండ్ అంటే మస్తీతో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. మరి.. ఈ వీక్ ఎలిమినేట్ అయింది మాతరం రతికా అని బలంగా చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం రతికా ఎలిమినేట్ అయిందంటూ ప్రచారాలు జరుగుతున్నాయి.

రతికా ఎలిమినేట్ అవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే హౌస్ లో కంటెంట్ విషయంలో రతికా పాత్ర ఎక్కువగా ఉంటుంది. రతికా లేకపోతే హౌస్ లో కచ్చితంగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తగ్గిపోతుందనే చెప్పాలి. అందుకే రతికా రోజ్ ఎలిమినేట్ అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని టాక్ వచ్చింది. కానీ, ఆఖరి రోజు ఓటింగ్ మొత్తం తారుమారు కావడంతో రతికా రోజ్ ఎలిమినేట్ అయిందంటూ చెబుతున్నారు. ఇప్పటికే నెట్టింట వచ్చిన అన్నీ లీకులు రతికా రోజ్ ఎలిమినేట్ అయినట్లే చెబుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన రతికా రోజ్ సోషల్ మీడియా టీమ్ కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. పైగా అమర్ దీప్ వల్లే రతికా రోజ్ ఎలిమినేట్ అయినట్లు రాసుకొచ్చారు.

ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్టులో అసలు ఏం చెప్పారంటే.. “రతికా రోజ్ ఎలిమినేట్ అయినట్లు అప్ డేట్ అందింది. తను డిసర్వింగ్ కంటెస్టెంట్. తను టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్. అమర్ దీప్ లాంటి కొందరు నెగిటివ్ పీపుల్ వల్ల ఆమె రాంగ్ ట్రాక్ లోకి వెళ్లింది. ప్లీజ్ తనకు సీక్రెట్ రూమ్ కి వెళ్లే అవకాశం ఇవ్వండి. తన వెనుక ఏం జరుగుతోంది అనే విషయాన్ని ఆమెకు తెలిసేలా చేయండి. ఆమె మంచి కోరుకునేది ఎవరు? ఆమెను వాడుకుంది ఎవరో తెలిసేలా చేయండి. రతికా నువ్వు చాలా మంచి వ్యక్తివి. అమర్ దీప్ నిన్ను వాడుకున్నాడు” అంటూ రతికా ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో స్టోరీ పోస్ట్ చేశారు. ఆ స్టోరీకి అమర్ దీప్ ని కూడా ట్యాగ్ చేశారు. అయితే తర్వాత కాసేపటికి ఆ స్టోరీని డిలీట్ చేశారు. కానీ, అప్పటికే తీసిన స్క్రీన్ షాట్లను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Rathika eliminated because of amardeep2

ఇక్కడ హౌస్ లో అమర్ దీప్ రతికా రోజ్ ని వాడుకున్నారు అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తనని తప్పుదారి పట్టేలా చేశారు అంటూ కామెంట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యి.. ఎలిమినేట్ అయ్యే వరకు ఏ విషయాన్ని వాళ్లు రివీల్ చేయకూడదు. కానీ, రూల్స్ ని పక్కన పెట్టి రతికా రోజ్ సోషల్ మీడియాలో హ్యండిల్ చేసేవాళ్లు ఆ విషయాన్న బయటపెట్టారు. మరి.. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. రతికా రోజ్ ఎలిమినేషన్ కరెక్ట్ నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş