iDreamPost
android-app
ios-app

వీడియో: శివాజీపై ఫైర్ అవుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్!

  • Published Jun 05, 2024 | 5:31 PM Updated Updated Jun 05, 2024 | 5:31 PM

Actor Shivaji- Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కు బుల్లితెర మెగాస్టార్ అనే పేరు ఊరికే రాలేదు. మనోడు ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ, ఎప్పుడూ సుధీర్ మీద జోకులు, సెటైర్లు వేసే వాళ్లు ఉండనే ఉంటారు. అలాగే శివాజీ వేసిన జోకులకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Actor Shivaji- Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కు బుల్లితెర మెగాస్టార్ అనే పేరు ఊరికే రాలేదు. మనోడు ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ, ఎప్పుడూ సుధీర్ మీద జోకులు, సెటైర్లు వేసే వాళ్లు ఉండనే ఉంటారు. అలాగే శివాజీ వేసిన జోకులకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

  • Published Jun 05, 2024 | 5:31 PMUpdated Jun 05, 2024 | 5:31 PM
వీడియో: శివాజీపై ఫైర్ అవుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్!

సుడిగాలి సుధీర్.. ఈ పేరు బుల్లితెర మీదే కాదు ఓటీటీలో కూడా ఒక బ్రాండ్ అయిపోయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సుడిగాలి సుధీర్ చేస్తున్న సర్కార్ సీజన్ 4 ప్రతిసారి టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తోంది. నిజంగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను కాదని.. సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో అలాంటి ఫలితాలను రాబట్టడం నిజంగా ఆశ్చర్యం అనే చెప్పాలి. అందులో ఎక్కువ క్రెడిట్ కచ్చితంగా సుధీర్ కే వెళ్తుంది. గతంలో యాంకర్ ప్రదీప్ ఈ షోకి హోస్ట్ గా చేసేవాడు. కానీ, సీజన్ 4కి మాత్రం సుడిగాలి సుధీర్ ని హోస్ట్ గా తీసుకొచ్చారు. సుధీర్ వచ్చాక ఈ షో మరింత వైరల్ అవుతోంది. అయితే ఈ షోకి గెస్ట్ గా వచ్చిన శివాజీ మీద మాత్రం సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో ఎంతో పాపులర్ అయ్యాడు. బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంక క్రేజ్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుధీర్ మీద పక్కన వాళ్లు, టీమ్ లో ఉండేవాళ్లు ఎన్నో రకాలుగా జోకులు వేయడం చేస్తుంటారు. అలాగే హేళన కూడా చేస్తుంటారు. అదంతా స్క్రిప్ట్ లో భాగంగానే జరుగుతూ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు మాత్రం ఆ జోకులను సుధీర్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయేవాళ్లు. ఎవరైతే సుధీర్ మీద జోకులు వేస్తారో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అదే పరిస్థితి శివాజీకి ఎదురైంది. నెట్టింట సుధీర్ ఫ్యాన్స్ శివాజీ విషయంలో కాస్త గుర్రుగా ఉన్నారు.

Sivaji vs Sudheer

శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటేకే 90స్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 7కో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ సర్కార్ సీజన్ 4లో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చాడు. అలాగే శివాజీతో పాటుగా.. నయనీ పావని, టేస్టీ తేజ, రతికా రోజ్ కూడా అతిథులుగా హాజరయ్యారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూడటానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతేకాకుండా.. ఈ ఎపిసోడ్ కూడా కచ్చితంగా ట్రెండింగ్ లోకి వస్తుంది అనడంలో ఎలాంటి సదేహం లేదు.

షోకి వచ్చిన గెస్టులకు హోస్ట్ వెల్కమ్ చెప్తాడు. అలాగే శివాజీకి కూడా స్వాగతం చెప్పాడు. ఆ తర్వాత శివాజీ కూడా సుధీర్ ని పొగిడేస్తాడు. ఆ తర్వాత మీ కామెడీ టైమింగ్ అంటే ఇష్టం రెండు జోకులు చెప్పండి అంటే.. ఇప్పుడు చెప్పింది అదే గా అంటూ సుధీర్ మీద జోకులేస్తాడు. ఆ తర్వాత కామన్ సెన్స్ ఉంటే ఆ కుర్చీలో కూర్చుని ఆడచ్చు అని చెప్తాడు. దానికి శివాజీ అయితే కామన్ సెన్స్ లేనోళ్లు ఇక్కడ ఉంటారు అంటూ సుధీర్ కి సెటైర్ వేశాడు. ఈ రెండు మాత్రమే కాకుండా.. షోలో ఇంకా చాలానే సెటైర్లు పడనున్నాయి. ఈ విషయంలోనే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ యాక్టర్ శివాజీ మీద ఫైర్ అవుతున్నారు. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అనే విషయం వారికి కూడా తెలుసు. కానీ, తమ అభిమాన యాక్టర్ ని హీరో స్థాయిలో చూస్తున్న తరుణంలో ఇలాంటి జోకులు వాళ్లు తీసుకోలేకపోతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet