iDreamPost
android-app
ios-app

YS Jagan: విజయవాడలో రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన CM జగన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఓ విషయంలో తన విశ్వసనీయతను చాటుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఓ ప్రాంత ప్రజలకు శ్వాశ్వత పరిష్కారం చూపించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఓ విషయంలో తన విశ్వసనీయతను చాటుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఓ ప్రాంత ప్రజలకు శ్వాశ్వత పరిష్కారం చూపించారు.

YS Jagan: విజయవాడలో రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన CM జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే నమ్మరం ప్రజల్లో బలంగా ఉంది. ఆ విధంగానే వారి నమ్మకాన్ని నిజం చేస్తూ.. తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ..పాలన సాగిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో అంశాల విషయంలో తాను చెప్పిన మాటను చేసి చూపించారు సీఎం జగన్. ముఖ్యంగా పేద, బడుగు,బలహీన వర్గాల వారి అభివృద్ధికి తాను ఇచ్చిన ప్రతి మాటను నిరవేర్చారు. తాజాగా మరోసారి తన విశ్వసనీయతను సీఎం జగన్ మోహన్ రెడ్డి చాటుకున్నారు. నేడు విజయవాడలోని రిటైనింగ్ వాల్స్ ను ప్రారంభించారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో రిటైనింగ్ వాల్ ను ప్రారంభించడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80వేల మందికి  వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి నీటిని విడుదల చేస్తున్నారంటచే ఆ పరిసర ప్రాంతాలైన  కృష్ణలంక, రణదీర్ నగర్, కోటీ నగర్, తారక రామనగర్,పోలీస్ కాలనీ, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. వరదలు మొదలవగానే  ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. కానీ  ఆ వరద నీరు ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలో మీటర్ల మేర రక్షణ  గోడ నిర్మించారు.  అంతేకాదు ఈ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్ల తో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు.

తాజాగా ఆ రిటైనింగ్ వాల్స్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇచ్చిన మాటల నిలబెట్టుకోవడంతో సీఎం జగన్ మరోసారి తన విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని తెలిపారు. రూ369 కోట్లతో 2.26 కి.మీ మేర గోడను నిర్మాణం చేశామని సీఎం జగన్ అన్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో  12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదని ఆయన తెలిపారు. అలానే గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రెంట్ పార్క్ ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ఈ  రిటైనింగ్ వాల్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో  ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి,  ఇతర అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా ఇన్నేళ్ల తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి